రైల్వేకోడూరు నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సోమవారం పగడాల వరలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఆయనతో పాటు తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి హాజరయ్యి రైల్వేకోడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పగడాల వరలక్ష్మి తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్ తో పాటు 12 మంది మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో భాగంగా చిట్వేలి మండలం మైలపల్లి పంచాయతీ ఎం.రాచపల్లి గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు చక్రవర్తుల నాగేశ్వర్ రాజు రైల్వే కోడూరు నియోజకవర్గ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ రాజు మాట్లాడుతూ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఎన్నికవ్వడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఈ పదవి రావడానికి సహకరించిన బిజెపి జిల్లా అధ్యక్షులు సాయిలోకేష్ కు, రైల్వేకోడూరు టిడిపి ఇన్చార్జ్ ముక్కా రూపనంద రెడ్డికి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు, కోడూరు బిజెపి అసెంబ్లీ కన్వీనర్ గడ్డం చంగల్ రాజు కు, రైల్వేకోడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పగడాల వరలక్ష్మి కి, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

రైల్వేకోడూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన బిజెపి సీనియర్ నాయకులు చక్రవర్తుల నాగేశ్వర్ రాజు