నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ సోషల్ జస్టిస్ సౌత్ ఇండియా కార్యాలయం ప్రారంభం
రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి
రైల్వేకోడూరు అన్నమయ్య జిల్లా లో
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రైల్వే కోడూరు మండల అధ్యక్షులు మోహన్ కృష్ణ అధ్యక్షతన
మానవ హక్కుల అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన సౌత్ ఇండియా ప్రెసిడెంట్ షేక్ జుబైర్ మాట్లాడుతూ పౌరులందరూ భారత రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులకు అనుగుణంగా మసులుకోవాలనీ పిలుపునిచ్చారు.అలాగే నేర రహిత భారతదేశాన్ని నిర్మిద్దామని ఆహ్వానించారు.
మహిళలను గౌరవించమని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి
మహిళా విభాగం కే సౌందర్య , అన్నమయ్య జిల్లా మీడియా ఇంచార్జ్ మరియు నియోజకవర్గ ఇన్చార్జి బైసాని కిరణ్ కుమార్,మండల అధ్యక్షులు మోహన్ కృష్ణ ,
అన్నమయ్య జిల్లా సెక్రెటరీ శివ ,రైల్వే కోడూరు మండల జనరల్ సెక్రెటరీ అల్లావుద్దీన్ ,మరియు సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.


