రైతుల సమ్మతితోనే భూసేకరణ – ఆర్ డి ఓ హుస్సేన్ సాహెబ్.

    0
    290

    05-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైయస్సార్ హౌసింగ్ స్కీమ్ కింద అ పేదవారికి నివేసన స్థలములను సేకరించు విషయంలో గ్రామస్తులకు ప్రభుత్వ అధికారులకుమధ్య వివాదాలు జరుగుతున్న సందర్భంలో ఆర్ డి ఓ హుస్సేన్ ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం లోని దామరమడుగు గ్రామస్తులకు వివరణ ఇవ్వడం జరిగింది. భూసేకరణ విషయంలో లో రైతుల స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ల సమ్మతి తెలిపిన తర్వాతే వారికి సంబందించిన భూములను భూసేకరణ చట్టం ద్వారా రావాల్సిన నష్టపరిహారం చెల్లించిన తర్వాతే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే భూ సేకరణ పూర్తయిన దృష్ట్యా మిగిలినటువంటి కార్యక్రమాలు అనగా చదును చేయడం, రోడ్లు డెవలప్ చేయడం, స్టోన్ ప్లాంటింగ్ చేయడం, సర్వే రాళ్లు స్థాపించడం, లాంటి వాటిపై దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు రెవెన్యూ డివిజన్ లో దరఖాస్తు చేసుకున్న వారిలో షుమారు 28 వేల మంది అర్హులైన లబ్దిదారులను గుర్తించడం జరిగింది. దీనిలో భాగంగానే దామరమడుగు లో కొంత భూమిని గుర్తించడం జరిగింది. అయితే ఆ గ్రామస్తులు మేము సన్నకారు రైతులము అప్పటి ప్రభుత్వం ఇచ్చిన భూములను ఇప్పుడు మీరు తీసుకోవడం సబబు కాదని మేము ఇవ్వకపోయినా బలవంతంగా తీసుకుంటామని కొందరు అధికారులు మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో నేను గ్రామస్తులతో మాట్లాడి వారికి ఈ భూ సేకరణ విషయముపై వివరణ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని మండలాల్లో భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందని ఉదాహరణకు కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, మనుబోలు, విడవలూరు ఇట్లాంటి మండలాల్లో ఇంకా కొంత భూసేకరణ చేయాల్సి ఉంది. ఈరోజు రేపట్లో దానిని కూడా పూర్తిచేయాల్సి ఉన్నామని ఈ కార్యక్రమం అంతా పూర్తి అయిన తర్వాత వచ్చే నెల 8 వ తారీఖున రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తహసిల్దార్ ద్వారా అందివ్వడమే కాకుండా ప్రతి లబ్ధిదారుని ఆయా స్థలం మీద పూర్తి హక్కులు కలిగేటట్టు ఆన్లైన్లో ఉంచడం జరుగుతుంది. ఈమేరకు జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్, అధికారుల ద్వారా ఇటువంటి ఏర్పాట్లను ముమ్మరం చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు బుచ్చిరెడ్డిపాలెం లో దామరమడుగు గ్రామంలో ఇంకా 10 ఎకరాల భూమి నివేసన స్థలాల అవసరాల నిమిత్తం కావాల్సి ఉంది. అంతేకాకుండా వవ్వేరు గ్రామంలో కూడా 7ఎకరాల 56 సెంట్లు భూమి అవసరమై ఉంది. ఈ రెండు ప్రతిపాదనలను పంపించడానికి బుచ్చిరెడ్డిపాలెం తాసిల్దార్ని ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో దామరమడుగు కి సంబంధించిన రైతు సంఘం నాయకులు రైతులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారు ఆలోచించుకొని సాయంత్రం లోపు ఇవి ప్రభుత్వం వారికి ఇవ్వడం కుదరని పక్షంలో ప్రత్యమ్యయంగా దీనికి సంబంధించి భూమి ఎక్కడ ఉందొ తెలియజేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు సమ్మతిస్తే రైతుల నుంచి సేకరించిన భూములకు సబ్ రిజిస్టార్ వ్యాల్యూ కు రెండున్నర రెట్లు ప్రభుత్వం వారు నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వ నిబంధనల మేరకు స్వీకరించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే జొన్నవాడ గ్రామంలోని నివేశన స్థలాల కు సంబంధించి కేటాయించిన భూమిని పరిశీలించడం జరిగింది. అంతే కాకుండా బుచ్చిరెడ్డిపాలెం లోని ఫైర్ స్టేషన్ కు సంబంధించి ప్రతిపాదనలో ఉన్న స్థలమును కూడా ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో లో బుచ్చి ఎమ్ ఆర్ ఓ షఫీ మాలిక్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు యాడ్ముత్యాల గురునాథం, సి పి ఎమ్ కోవూరు డివిజన్ అధ్యక్షుడు వెంకమరాజు, మొదలగు జిల్లాస్థాయి మండలస్థాయి నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.

    0
    0