*రైతుల ఆత్మహత్యా యత్నం*
*జగనన్న న్యాయం చేయక పోతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని నినాదాలు*
తడ మండలం తడ హరిజన వాడలో రైతులు చిన్నపిల్లలు సైతం పెట్రోల్ బాటిల్ చేతపట్టుకొని మేము పండించే భూములు జోలికి వస్తే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళన చేపడుతున్నారు
రైతులను కాపాడాల్సిన ప్రభుత్వమే రైతుల కడుపు కొట్టడం న్యాయమేనా అని ఆందోళన చేస్తున్న రైతు కుటుంబాలు
70 సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి భూమిని ఇంటి పట్టాల కొరకు ఇవ్వాలి అని అనుకుంటే మా గ్రామం చుట్టూ ప్రభుత్వ భూములు ఎందుకు పనికి రాకుండా ఉన్న భూమిని ఇవ్వచ్చు కదా మేము సాగు చేసుకుంటూ ఆ భూమిపై బ్రతుకుతున్న మా దగ్గర నుంచి లాక్కోవడం ఎంతవరకు న్యాయమంటున్న రైతులు
వెంటనే రైతుల ఇబ్బందులను తెలుసుకొని కలెక్టర్ గారూ మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మండల తాసిల్దారు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వవలసింది గా కలెక్టర్ గారిని మరియు ఎమ్మెల్యే గారిని గ్రామస్థులు కోరడంమైనది.