ప్రజా భూమి ప్రతినిధి, తిరుపతి రూరల్
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే ఆయనకు రైతు కష్టాలు ప్రతి ఒక్కటి తెలుసు అని రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు* సోమవారం తిరుపతి రూరల్ మండలం పంచాయతీ కుంట్రపాక గ్రామంలో రైతన్నా మీకోసం కార్యక్రమం నిర్వహించారూ.
ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని కి ఘన స్వాగతం పలికిన కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు..అన్నదాత సుఖీభవ కార్యక్రమం పై గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపిన సందేశాన్ని రైతులకు వినిపించిన అధికారులు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రతి రైతు కుటుంబంలో ఆనందం కోసమే కూటమి ప్రభుత్వ ఆరాటం అన్నారు
తిరుపతి రూరల్ మండలంలో 2911 మంది రైతులకు కోటి 64 లక్షల రూపాయలు మూడో విడత విడుదలచేసింది.**అన్నదాత సుఖీభవ పథకం రైతులకు అందుతున్న తీరుపై స్వయంగా గ్రామంలోని రైతుల ఇండ్లకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికల సమయంలో మీ గ్రామానికి వచ్చినప్పుడు కూటమి నాయకత్వంలో ఇచ్చిన హామీలతో పాటుగా మీ గ్రామానికి ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చమన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు





