26-10-2025
పున్నమి ప్రతినిధి:
ఆలంపల్లి దుర్గేష్
9133469506
*ఫార్మా రైతులు ఎలక్షన్ లో పాల్గొన కూడదని కుట్ర పూరితంగా నామినేషన్లని రిజెక్టు చేశారు*
కాంగ్రెస్ పార్టీ 2023 ఎలక్షన్ లో మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలని తుంగలో తొక్కి ఫార్మా సిటీ ని రద్దు చేయకుండా, రైతుల భూములని ఆన్లైన్ లో ఎక్కించి అన్ని హక్కులు కల్పిస్తామని అప్పుడు మాట ఇచ్చి, గెలిచిన తర్వాత మోసం చేసి, పోలీసులని పెట్టించి భూములు గుంజుకుటుందన్న వాస్తవాలు మొత్తం తెలంగాణ ప్రజలకి తెలియచేయ్యాలని, ఫార్మా రైతులు జూబిలీ హిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ లో నామినేషన్ వేశారు.
నామినేషన్ వెయ్యకుండా కాంగ్రెస్ సర్కార్ అడుగడుగునా అనేక అడ్డంకులు సృష్టించారు. అసలు సర్టిఫైడ్ ఎలక్టోరల్ రోల్స్ ఇయ్యటానికి ఇబ్రహీంపట్నం RDO ఆఫీస్ చుట్టు 4 రోజులు తిప్పించుకున్నారు. ఆఖరికి ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చినా, సర్టిఫికెట్ ఇచ్చేశానని వారికి అబద్దం చెప్పారు. ఆఖరికి మీరు ఇచ్చేదాక మీ ఆఫీస్ నుంచి కదిలేదు లేదని రైతులు తేల్చి చెప్పాడంతో చేసేది లేక ఇచ్చారు.
రైతుల గురించి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎంక్వయిరీ చేస్తూ భయ పెట్టేందుకు ప్రయత్నించారు. అన్ని ఎదురుకుని 21-10-2025 తేదిన రైతులు నామినేషన్ వేశారు. నామినేషన్ రోజునే ఫార్మా రైతులు బంజారా హిల్స్ తాసిల్దార్ ఆఫీస్ వద్ద చేసిన ర్యాలీ, రైతుల ఇంటర్వ్యూలు మొత్తం రాష్ట్ర మీడియా లో హల్చల్ చేసింది. ఫార్మా రైతులు పోటీలో ఉంటే ప్రభుత్వానికి నెగటివ్ ప్రచారం జరుగుతుంది అని, మొత్తం ఫార్మా రైతుల నామినేషన్స్ ని రిజెక్ట్ చేశారు. రిజెక్షన్ కి కారణాలు అడిగితే ఎలక్షన్ నిర్వహణ అధికారులు మీరు ఇచ్చిన అఫిడవిట్ లో “బ్లాంక్స్” అంటే ఖాళీలు ఉన్నాయి అన్నారు. అఫిడవిట్ లో నాలుగు కాలమ్స్ ఉంటే ఒక కాలమ్ లో రాసిన మేటర్ ఎక్కువగా ఉండి పక్క పేజీలో ఆ కాలమ్ లో మేటర్ ఉండి, మిగతా కాలమ్స్ ఖాళీగా ఉన్నాయి. ఇది కంటిన్యూ అయినదే తప్ప ఖాళీలు కావు. ఇదే విధమైన ఖాళీలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇచ్చిన 4 అఫిడవిట్స్ లో ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అఫిడవిట్స్ అన్నిటీలో కూడా ఇలా ఖాళీలు ఉన్నాయి. అయన వన్నీ కూడా accept చేశారు. దీపక్ రెడ్డి ఇచ్చిన అఫిడవిట్ ఒక దాంట్లో అయితే ఆయన ఫోటో కూడా లేదు. అది కూడా accept చేశారు. కానీ బ్లాంక్స్ ఉన్నాయని ఫార్మా రైతుల నామినేషన్ రిజెక్టు చేశారు. ఇదే కారణం చెప్పి RRR రైతుల నామినేషన్స్ అన్ని రిజెక్టు చేశారు. ఇది ఖచ్చితంగా కుట్ర పూరితంగా జరిగింది.
ఈ విషయం గురించి మేము జనరల్ అబ్సర్వర్ , అట్లాగే చీఫ్ ఎలక్షన్ కమీషనర్, న్యూ ఢిల్లీ ఫిర్యాదు చేసాము.
ఒక పక్క రాహుల్ గాంధీ నేను రాజ్యాంగాన్ని రక్షిస్తాను, ప్రజా స్వామ్యాన్ని రక్షిస్తాను అని అంటారు. మరీ వాళ్ళ ప్రభుత్వమే రాజ్యాంగ విరుద్ధంగా, ప్రజా స్వామ్యాన్ని కాలరాస్తుంటే ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు.
ఇట్లు
ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ

రైతులు ఎలక్షన్ లో పాల్గొన కూడదని కుట్ర పూరితంగా నామినేషన్లని రిజెక్టు చేశారు
26-10-2025 పున్నమి ప్రతినిధి: ఆలంపల్లి దుర్గేష్ 9133469506 *ఫార్మా రైతులు ఎలక్షన్ లో పాల్గొన కూడదని కుట్ర పూరితంగా నామినేషన్లని రిజెక్టు చేశారు* కాంగ్రెస్ పార్టీ 2023 ఎలక్షన్ లో మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలని తుంగలో తొక్కి ఫార్మా సిటీ ని రద్దు చేయకుండా, రైతుల భూములని ఆన్లైన్ లో ఎక్కించి అన్ని హక్కులు కల్పిస్తామని అప్పుడు మాట ఇచ్చి, గెలిచిన తర్వాత మోసం చేసి, పోలీసులని పెట్టించి భూములు గుంజుకుటుందన్న వాస్తవాలు మొత్తం తెలంగాణ ప్రజలకి తెలియచేయ్యాలని, ఫార్మా రైతులు జూబిలీ హిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ లో నామినేషన్ వేశారు. నామినేషన్ వెయ్యకుండా కాంగ్రెస్ సర్కార్ అడుగడుగునా అనేక అడ్డంకులు సృష్టించారు. అసలు సర్టిఫైడ్ ఎలక్టోరల్ రోల్స్ ఇయ్యటానికి ఇబ్రహీంపట్నం RDO ఆఫీస్ చుట్టు 4 రోజులు తిప్పించుకున్నారు. ఆఖరికి ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చినా, సర్టిఫికెట్ ఇచ్చేశానని వారికి అబద్దం చెప్పారు. ఆఖరికి మీరు ఇచ్చేదాక మీ ఆఫీస్ నుంచి కదిలేదు లేదని రైతులు తేల్చి చెప్పాడంతో చేసేది లేక ఇచ్చారు. రైతుల గురించి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎంక్వయిరీ చేస్తూ భయ పెట్టేందుకు ప్రయత్నించారు. అన్ని ఎదురుకుని 21-10-2025 తేదిన రైతులు నామినేషన్ వేశారు. నామినేషన్ రోజునే ఫార్మా రైతులు బంజారా హిల్స్ తాసిల్దార్ ఆఫీస్ వద్ద చేసిన ర్యాలీ, రైతుల ఇంటర్వ్యూలు మొత్తం రాష్ట్ర మీడియా లో హల్చల్ చేసింది. ఫార్మా రైతులు పోటీలో ఉంటే ప్రభుత్వానికి నెగటివ్ ప్రచారం జరుగుతుంది అని, మొత్తం ఫార్మా రైతుల నామినేషన్స్ ని రిజెక్ట్ చేశారు. రిజెక్షన్ కి కారణాలు అడిగితే ఎలక్షన్ నిర్వహణ అధికారులు మీరు ఇచ్చిన అఫిడవిట్ లో “బ్లాంక్స్” అంటే ఖాళీలు ఉన్నాయి అన్నారు. అఫిడవిట్ లో నాలుగు కాలమ్స్ ఉంటే ఒక కాలమ్ లో రాసిన మేటర్ ఎక్కువగా ఉండి పక్క పేజీలో ఆ కాలమ్ లో మేటర్ ఉండి, మిగతా కాలమ్స్ ఖాళీగా ఉన్నాయి. ఇది కంటిన్యూ అయినదే తప్ప ఖాళీలు కావు. ఇదే విధమైన ఖాళీలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇచ్చిన 4 అఫిడవిట్స్ లో ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అఫిడవిట్స్ అన్నిటీలో కూడా ఇలా ఖాళీలు ఉన్నాయి. అయన వన్నీ కూడా accept చేశారు. దీపక్ రెడ్డి ఇచ్చిన అఫిడవిట్ ఒక దాంట్లో అయితే ఆయన ఫోటో కూడా లేదు. అది కూడా accept చేశారు. కానీ బ్లాంక్స్ ఉన్నాయని ఫార్మా రైతుల నామినేషన్ రిజెక్టు చేశారు. ఇదే కారణం చెప్పి RRR రైతుల నామినేషన్స్ అన్ని రిజెక్టు చేశారు. ఇది ఖచ్చితంగా కుట్ర పూరితంగా జరిగింది. ఈ విషయం గురించి మేము జనరల్ అబ్సర్వర్ , అట్లాగే చీఫ్ ఎలక్షన్ కమీషనర్, న్యూ ఢిల్లీ ఫిర్యాదు చేసాము. ఒక పక్క రాహుల్ గాంధీ నేను రాజ్యాంగాన్ని రక్షిస్తాను, ప్రజా స్వామ్యాన్ని రక్షిస్తాను అని అంటారు. మరీ వాళ్ళ ప్రభుత్వమే రాజ్యాంగ విరుద్ధంగా, ప్రజా స్వామ్యాన్ని కాలరాస్తుంటే ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. ఇట్లు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ

