రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరు ఎమ్మార్వో ఆఫీస్ నందు జరిగిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీసీఎంఎస్ చైర్మన్ జయప్రకాష్ కోడూరు నియోజకవర్గ రైతులకు మొత్తం 16 కోట్ల 50 లక్షల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగినది. మొత్తం 24,622 మంది రైతులు లబ్ధి పొందడం జరిగినది. జయప్రకాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల పక్షంగా ఎన్నో కార్యక్రమాలను సబ్సిడీలను ఇవ్వడం జరుగుతుంది. రైతులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని తెలియజేశారు.
సందేప్ మండల వ్యవసాయ అధికారి రైల్వే కోడూరు మరియు అంతేకాకుండా ఈ కార్యక్రమంలో అభ్యుదయ రైతులు, పీఎం కిసాన్ అన్నదాత లబ్ధిదారులు,రైల్వే కోడూరు నియోజకవర్గ వ్యవసాయ సహాయ సంచాలకులు ఎస్ మనీ గారు, నియోజకవర్గ మండల వ్యవసాయ మరియు ఉద్యాన అధికారులు, విలేజ్ అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్ అసిస్టెంట్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, నాయకులు పాల్గొనడం జరిగినది.


