(పున్నమి ప్రతినిధి, నెల్లూరు )
సబ్సిడీపై పలు రైతు గ్రూపులకు కలెక్టరేట్‌లో యంత్రపరికరాలను పంపిణీ చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కెవిఎన్ చక్రధర్‌బాబు, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, వి.వరప్రసాద్, కిలివేటి సంజీవయ్య, డీసీసీబీ ఛైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వ్యవసాయ సలహా మండలి జిల్లా ఛైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డిల ఆధ్వర్యంలో వరి కోత యంత్రాలతో పాటు ఇతర యంత్రాలను రైతులకు అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ చక్రధర్‌బాబు మాట్లాడుతూ జిల్లాలో 270 రైతు గ్రూపులకు 2445 యంత్రాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. యంత్ర సేవా పథకం కింద ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.6.09 కోట్లు సబ్సిడీ రూపంలో వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ హరేందిర ప్రసాద్, వ్యవసాయ శాఖ జేడీ ఆనందకుమారి తదితరులు పాల్గొన్నారు
రైతులకు యంత్ర పరికరాలు పంపిణీ
(పున్నమి ప్రతినిధి, నెల్లూరు ) సబ్సిడీపై పలు రైతు గ్రూపులకు కలెక్టరేట్‌లో యంత్రపరికరాలను పంపిణీ చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కెవిఎన్ చక్రధర్‌బాబు, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, వి.వరప్రసాద్, కిలివేటి సంజీవయ్య, డీసీసీబీ ఛైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వ్యవసాయ సలహా మండలి జిల్లా ఛైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డిల ఆధ్వర్యంలో వరి కోత యంత్రాలతో పాటు ఇతర యంత్రాలను రైతులకు అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ చక్రధర్‌బాబు మాట్లాడుతూ జిల్లాలో 270 రైతు గ్రూపులకు 2445 యంత్రాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. యంత్ర సేవా పథకం కింద ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.6.09 కోట్లు సబ్సిడీ రూపంలో వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ హరేందిర ప్రసాద్, వ్యవసాయ శాఖ జేడీ ఆనందకుమారి తదితరులు పాల్గొన్నారు