– మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
కామారెడ్డి, 21నవంబర్, (పున్నమి ప్రతినిధి ) :
మంత్రి సీతక్క బేషరుతుగా రైతులకు క్షమాపణ చెప్పాలి
– ఎమాజీల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో గురువారం పర్యటనకు వచ్చారు.మంత్రి శ్రీమతి సీతక్క,అక్కడ బోనస్ ఇవ్వాలని వచ్చిన రైతులతో మంత్రి సీతక్క సంఘర్షణ ఏర్పడింది. రైతులు తమ వరి ధాన్యం కొనుగోలు చేయక అధిక సమ యాలు కాలాయపణ, బోనస్ చెల్లింపులు ఆలస్యం జరపడాన్ని డిమాండ్ చేశారు. అయితే మంత్రి సీతక్క రైతులపై అసహనం, కఠినంగా ప్రవర్తించి “మీరు అసలు రైతులే కాదని” అనీ, రైతులను అడ్డుకుంటూ వారిపై కేసులు పెట్టడాన్ని అమలులో పెట్టారని తీవ్ర విమర్శలకు గురయ్యారు.ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఈ పరిస్థితిని తీవ్రంగా ఖండించారు.రైతుల పక్షంలో నిలబడి చెప్పారు. సీతక్క వ్యవహారం అసభ్యకరమైనదిగా, రైతుల బాధలను వినకపోయినట్లు విమర్శించారు. కెసిఆర్ ప్రభుత్వంలో పంటలను సకాలంలో కొను గోలు చేసి, డబ్బులు చెల్లింపులను చేశారని చెప్పా రు.ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తప్ప రైతుల పట్ల ప్రాముఖ్యత ఇవ్వడంలేదని, అమలు కాని హామీలతో రైతులను మోసం చేస్తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.జాజాల సురేందర్ రామారెడ్డి రైతులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే, ప్రభుత్వం వెంటనే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని, సన్న వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడిగె ల శ్రీనివాస్, గురిజాల నారాయణ రెడ్డి, మాజీ సర్పంచులు, ఉప సర్పంచ్లు నాయకులు టిఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్యకర్త లు తదితరులు పాల్గొన్నారు.


