అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన సిఐటియు జిల్లా అధ్యక్షుడు సి.హెచ్. చంద్రశేఖర్‌పై పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. కోడూరు, చిట్వేలు, పెనుగులూరు, ఓబులవారిపల్లె మండలాల్లో రైతులు విస్తారంగా సాగు చేసిన బొప్పాయి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతుల తరఫున పోరాడినందుకే పోలీసులు కేసు పెట్టారని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ నిర్ణయించిన ₹9 ధరను కూడా వ్యాపారులు అమలు చేయకుండా మధ్యవర్తులు, ఢిల్లీ వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే బైండోవర్ కేసును ఉపసంహరించి, బొప్పాయి రైతులకు న్యాయమైన ధర కల్పించాలని, మోసగాళ్లపై సెక్షన్ 420 కింద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.

రైతులకు న్యాయం అడిగితే బైండోవర్ కేసా? – సిఐటియు నేత చంద్రశేఖర్‌పై పోలీసుల చర్యపై తీవ్ర ఆగ్రహం