*రైతులకు ఎరువులు తగిన సమయానికి అందించాలి,మానవ అక్రమ రవాణా ఘటన పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి*
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: సరిపడా ఎరువులను తగిన సమయానికి రైతులకు అందించేందుకు అధికారులు కృషి చేయాలని వాంకిడి మండల బీజేపీ శక్తి కేంద్ర ఇంచార్జ్ చంద్ర శేఖర్ మంగళవారం కోరారు. ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు ఎరువుల పంపిణీ చేస్తున్న క్రమంలో రైతులు ఇక్కట్లు పడుతున్నరన్నారు.ఉదయం నుంచి యూరియా బస్తాల కోసం రైతులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుందని తెలిపారు.రైతులకు సరిపడా ఎరువులు అందడం లేదని ఆరోపించారు. అధికారులు స్పందించి రైతులకు సరిపడా ఎరువులను సరైన సమయానికె రైతులకు అందిస్తేనే రైతులకు మేలు అని పేర్కొన్నారు.ఇటీవల ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన మానవ అక్రమ రవాణా బాధాకరమైన విషయం అన్నారు. ఆదివాసీ మహిళలను అక్రమంగా మాయమాటలు చెప్పి నమ్మించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న వాటిని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు, ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.