(పున్నమి ప్రతినిధి)
రేషన్ బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ కెనల్స్ ఉండటం వల్ల రక్తహీనత వంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తెలిపారు. ఆన్లైన్‌లో ఎక్కడైనా రేషన్ తీసుకునే సదుపాయం వల్ల కొన్ని రేషన్ షాపుల వద్ద తాత్కాలికంగా స్టాక్ సమస్యలు ఉన్నాయని ప్రజలు తెలిపిన నేపథ్యంలో, ఆయన జిల్లా పౌర సరఫరాల శాఖ సూపరిటెండెంట్ లక్ష్మీనారాయణ రెడ్డిని కార్యాలయంలో కలిసి ఫిర్యాదులు అందజేశారు.
బియ్యం తీసుకోనంత మాత్రాన వైట్ కార్డు రద్దు అవుతుందన్నది అపోహ మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం పేదలకు నాణ్యమైన రేషన్ బియ్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. రైతుల ధాన్య కొనుగోలు చెల్లింపులు 24 గంటల్లో ఖాతాల్లో జమ అవుతున్నాయని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయాలని కోరారు.
స్టాక్ సమస్య ఉన్న రేషన్ షాపులకు తక్షణమే సరుకు అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


