పున్నమి ప్రతినిధి నిర్మల్:
సారంగాపూర్ మండల కేంద్రంలో మండలానికి చెందిన 2118 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఇది శుభ పరిణామం అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం గత 5 సంవత్సరాలుగా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుందని తెలిపారు. రేషన్ కార్డు లేని కారణంగా సంక్షేమ పథకాలకు అనర్హులుగా ప్రకటించారని, ప్రస్తుతం అర్హులైన పేద ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలని సూచించారు. ఇంకా రేషన్ కార్డులు లేని ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ గారు, జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి గారు, నాయకులు రావుల రాంనాథ్, ఆర్డీవో రత్నా కళ్యాణి గారు, ఎమ్మార్వో, ఎంపీడీవో,మండల అధ్యక్షులు, మండల నాయకులు, కారకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
పున్నమి ప్రతినిధి నిర్మల్: సారంగాపూర్ మండల కేంద్రంలో మండలానికి చెందిన 2118 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఇది శుభ పరిణామం అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం గత 5 సంవత్సరాలుగా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుందని తెలిపారు. రేషన్ కార్డు లేని కారణంగా సంక్షేమ పథకాలకు అనర్హులుగా ప్రకటించారని, ప్రస్తుతం అర్హులైన పేద ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలని సూచించారు. ఇంకా రేషన్ కార్డులు లేని ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ గారు, జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి గారు, నాయకులు రావుల రాంనాథ్, ఆర్డీవో రత్నా కళ్యాణి గారు, ఎమ్మార్వో, ఎంపీడీవో,మండల అధ్యక్షులు, మండల నాయకులు, కారకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

