పున్నమి ప్రతి నిధి
జూబ్లీహిల్స్
ఫ్రీ బస్సు ఎందుకు అని మహిళలే ప్రశ్నిస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. పేదల ఇళ్ల మీదకి బుల్డోజర్లు పంపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
మూడు నెలల తరువాత కే.సి.ఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు.
అలాగే కేటీఆర్ మీద ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.


