Thursday, 5 February 2026
  • Home  
  • రేపటి నుండి కాలేజీ లు పునః ప్రారంభం
- తెలంగాణ

రేపటి నుండి కాలేజీ లు పునః ప్రారంభం

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ప్రతి నిది తెలంగాణ) ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణతో రాష్ట్రంలోని అన్ని కాలేజీలు రేపటి నుండి తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో నేడు ప్రవేటు కాలేజిల యాజమాన్యం నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. చర్చల ఫలితంగా ప్రభుత్వం తక్షణమే రూ.600 కోట్లు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కింద విడుదల చేయగా, మరో రూ.300 కోట్లు త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అదనంగా, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ప్రక్రియ పర్యవేక్షణకు ప్రభుత్వ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం ప్రతినిధులు కూడా ఉంటారని అధికారులు తెలిపారు. దీంతో విద్యార్థుల తరగతులు సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది.

పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి ప్రతి నిది తెలంగాణ)

ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణతో రాష్ట్రంలోని అన్ని కాలేజీలు రేపటి నుండి తిరిగి ప్రారంభమవుతున్నాయి.
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో నేడు ప్రవేటు కాలేజిల యాజమాన్యం నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. చర్చల ఫలితంగా ప్రభుత్వం తక్షణమే రూ.600 కోట్లు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కింద విడుదల చేయగా, మరో రూ.300 కోట్లు త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
అదనంగా, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ప్రక్రియ పర్యవేక్షణకు ప్రభుత్వ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం ప్రతినిధులు కూడా ఉంటారని అధికారులు తెలిపారు.

దీంతో విద్యార్థుల తరగతులు సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.