నెల్లూరు,15.05.2020 పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ ✍
ఏపీలో రేపటి నుంచి 4వ విడత ఉంచిత రేషన్ పంపిణీ కార్యక్రమం మొదలుకానుంది. రాష్ట్రంలో మొత్తం కోటి 48 లక్షల 5,879 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం,కేజీ శనగలను ప్రభుత్వం ఇవ్వనుంది.రేషన్ కార్డుదారులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేయగా, పోర్టబులిటి ద్వారా ఎక్కడ ఉంటే అక్కడ రేషన్ తీసుకునే వెసులుబాటు కలనించింది. రేషన్ తీసుకునేందుకు షాపుల వారీగా టైం స్లాట్ కేటాయించింది.