Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Peddapalli

రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని మంత్రి శ్రీధర్ బాబుకు మంథని గౌడ సంఘం వినతి

Punnami Newsroom Published:
రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని మంత్రి శ్రీధర్ బాబుకు మంథని గౌడ సంఘం వినతి

Story highlights

  • మంథని, సెప్టెంబర్ 01: గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయడంతో పాటు రేణుక ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధి, పుష్కరాలకు సంబంధించిన నిధులు కేటాయించాలని కోరుతూ మంథని గౌడ సంఘం పాలకవర్గ సభ్యులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలిసి వినతిపత్రం అందజేశారు.
  • మంగళవారం హైదరాబాద్‌ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన సంఘం నాయకులు..
  • కమ్యూనిటీ హాల్ నిర్మాణం, రేణుక ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధి, పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన పనులకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు.

మంథని, సెప్టెంబర్ 01:
గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయడంతో పాటు రేణుక ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధి, పుష్కరాలకు సంబంధించిన నిధులు కేటాయించాలని కోరుతూ మంథని గౌడ సంఘం పాలకవర్గ సభ్యులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. మంగళవారం హైదరాబాద్‌ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన సంఘం నాయకులు.. కమ్యూనిటీ హాల్ నిర్మాణం, రేణుక ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధి, పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన పనులకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. వారి వినతిపై మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకులు తెలిపారు. అనంతరం రేణుక ఎల్లమ్మ అమ్మవారి చిత్రపటాన్ని మంత్రికి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణంతో గౌడ సమాజానికి సమావేశాలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు సౌకర్యం కలుగుతుందని నాయకులు పేర్కొన్నారు. రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధితో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంథని గౌడ సంఘం అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *