కామారెడ్డి,6 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం స్కూల్ తాండ గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ పాలకవర్గానికి ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, స్కూల్ అభివృద్ధికి అంగీకారం తెలిపారు.స్కూల్ తండా సర్పంచ్ సలావత్ బుచ్చిరెడ్డి, ఉపసర్పంచ్ గంగావత్ రమేష్, జగదాంబ తండ సర్పంచ్ భూక్యా లతా, బాయనంద ఉపసర్పంచ్ గంగావత్ పూర్ణరాజు, నాయక్ బట్టు తండా సర్పంచ్ బట్టు బికినీ, ఉపసర్పంచ్ రాతుల కిషోర్లకు ప్రత్యేక సన్మానం.వార్డు సభ్యులు రాతుల సవిత, రంజిత్, గంగావత్ సేవ్య, గంగావత్ సంతోష్, సలావత్ లలిత, నరేష్, సలవత్ తిరుపతి లకు ఘన సత్కా రం పొందారు. పాఠశాలకు ఎల్లవేళలా అభివృద్ధి కొరకు సహకారం ఉండాలని కోరారు.ఉపాధ్యా యులు, భవిష్యత్ సహకారం కోరారు. గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.


