సెప్టెంబర్ 30 పున్నమి ప్రతినిధి
భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఈరోజు (సెప్టెంబర్ 30) నది నీటిమట్టం 48 అడుగులు దాటి 48.7 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం సుమారు 11 లక్షల 80 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించారు. రెస్క్యూ బృందాలు మోహరించాయి. ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


