Sunday, 7 December 2025
  • Home  
  • రెండు, మూడు రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్.
- నాగర్‌కర్నూల్

రెండు, మూడు రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్.

*రెండు, మూడు రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్… కొడంగల్‌లో సంచలన ప్రకటన చేసిన సీఎం రేవంత్* పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రెండు రోజుల్లో వస్తుందని సీఎం రేవంత్ కొడంగల్ లో ప్రకటించారు. సర్పంచ్ ఎన్నికలు అత్యంత కీలకమైనవని.. అభివృద్ధికి అడ్డుపడేవారిని ఎన్నుకోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కోడంగల్లోని యెంకేపల్లి రోడ్డులో అక్షయపాత్ర ఫౌండేషన్ మిడ్ డే మీల్స్ కిచెన్ బిల్డింగ్ కోసం రేవంత్ భూమిపూజ చేశారు. అలాగే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తర్వాత బహిరంగసభలో పాల్గొన్నారు. *కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఒక మోడల్ గా మారుస్తాం* అభివృద్ధిలో కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఒక మోడల్ గా మారుస్తామని.. సర్పంచ్ ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డలు సంతోషంగా ఉంటేనే ఆ రాష్ట్రంలో ఆర్ధిక అభివృద్ధి ఉంటుంని.. ప్రతీ పేద తల్లి కళ్లల్లో ఆనందం చూడాలని సన్నబియ్యం పంపిణీ చేపట్టామన్నారు. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం.. వారిని ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామని తెలిపారు. అదానీ అంబానీలతో పోటీ పడేలా సోలార్ ప్లాంట్స్ నిర్వహణ మహిళలకు అప్పగించామని గుర్తు చేశారు. మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు మంచి చదువు అందించడం ఒక్కటే మార్గం .మీ పిల్లలు గొప్పగా చదువుకుంటేనే మీ జీవితాల్లో మార్పు సాధ్యమవుతుందన్నారు. *ఏ విద్యార్థి కూడా ఆకలితో ఇబ్బంది పడకూడదు* అందుకే అక్షయ పాత్ర ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 312 ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల మంది విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నాం. ఏ విద్యార్థి కూడా ఆకలితో ఇబ్బంది పడకుండా చేస్తున్నామని తెలిపారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా మధ్యాహ్న భోజనాన్ని అందించే కార్యక్రమం తీసుకున్నాం . బిడ్డల గురించి కన్నతల్లి ఆలోచించినట్లుగా… మా ప్రభుత్వం ఆలోచించి వారి ఆకలి తీరుస్తోందని భరోసా ఇచ్చారు. *ఎడ్యుకేషన్ హబ్ గా కొడంగల్* ఎడ్యుకేషన్, ఇరిగేషన్ మా మొదటి ప్రాధాన్యత కొడంగల్ నియోజకవర్గానికి మెడికల్, వెటర్నరీ, అగ్రి, పారామెడికల్, నర్సింగ్, ఇంజనీరింగ్ కళాశాలలు , ఏటీసీలను, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్, డిగ్రీ కళాశాలలు, సైనిక్ స్కూల్ తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి గొప్ప చదువులకోసం కొడంగల్ కు వెళ్లాలి అనేలా కొడంగల్ ను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. 16 నెలల్లో అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ హబ్ గా కొడంగల్ ను మార్చాలని ప్రయత్నిస్తున్నామని.. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. *ఆడబిడ్డలకు ప్రభుత్వం అందిస్తున్న సారె ఇందిరమ్మ చీరలు* అధికారులు ప్రతీ ఆడబిడ్డకు చీర చేరేలా చూడాలన్నారు. పదేళ్లు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంటుంది ..రాజకీయాలకు అతీతంగా కొడంగల్ ను అభివృద్ధి చేసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు….

*రెండు, మూడు రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్… కొడంగల్‌లో సంచలన ప్రకటన చేసిన సీఎం రేవంత్*

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రెండు రోజుల్లో వస్తుందని సీఎం రేవంత్ కొడంగల్ లో ప్రకటించారు. సర్పంచ్ ఎన్నికలు అత్యంత కీలకమైనవని.. అభివృద్ధికి అడ్డుపడేవారిని ఎన్నుకోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కోడంగల్లోని యెంకేపల్లి రోడ్డులో అక్షయపాత్ర ఫౌండేషన్ మిడ్ డే మీల్స్ కిచెన్ బిల్డింగ్ కోసం రేవంత్ భూమిపూజ చేశారు. అలాగే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తర్వాత బహిరంగసభలో పాల్గొన్నారు.

*కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఒక మోడల్ గా మారుస్తాం*

అభివృద్ధిలో కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఒక మోడల్ గా మారుస్తామని.. సర్పంచ్ ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డలు సంతోషంగా ఉంటేనే ఆ రాష్ట్రంలో ఆర్ధిక అభివృద్ధి ఉంటుంని.. ప్రతీ పేద తల్లి కళ్లల్లో ఆనందం చూడాలని సన్నబియ్యం పంపిణీ చేపట్టామన్నారు. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం.. వారిని ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామని తెలిపారు. అదానీ అంబానీలతో పోటీ పడేలా సోలార్ ప్లాంట్స్ నిర్వహణ మహిళలకు అప్పగించామని గుర్తు చేశారు. మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు మంచి చదువు అందించడం ఒక్కటే మార్గం .మీ పిల్లలు గొప్పగా చదువుకుంటేనే మీ జీవితాల్లో మార్పు సాధ్యమవుతుందన్నారు.
*ఏ విద్యార్థి కూడా ఆకలితో ఇబ్బంది పడకూడదు*
అందుకే అక్షయ పాత్ర ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 312 ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల మంది విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నాం. ఏ విద్యార్థి కూడా ఆకలితో ఇబ్బంది పడకుండా చేస్తున్నామని తెలిపారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా మధ్యాహ్న భోజనాన్ని అందించే కార్యక్రమం తీసుకున్నాం . బిడ్డల గురించి కన్నతల్లి ఆలోచించినట్లుగా… మా ప్రభుత్వం ఆలోచించి వారి ఆకలి తీరుస్తోందని భరోసా ఇచ్చారు.
*ఎడ్యుకేషన్ హబ్ గా కొడంగల్*
ఎడ్యుకేషన్, ఇరిగేషన్ మా మొదటి ప్రాధాన్యత కొడంగల్ నియోజకవర్గానికి మెడికల్, వెటర్నరీ, అగ్రి, పారామెడికల్, నర్సింగ్, ఇంజనీరింగ్ కళాశాలలు , ఏటీసీలను, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్, డిగ్రీ కళాశాలలు, సైనిక్ స్కూల్ తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి గొప్ప చదువులకోసం కొడంగల్ కు వెళ్లాలి అనేలా కొడంగల్ ను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. 16 నెలల్లో అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ హబ్ గా కొడంగల్ ను మార్చాలని ప్రయత్నిస్తున్నామని.. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు.
*ఆడబిడ్డలకు ప్రభుత్వం అందిస్తున్న సారె ఇందిరమ్మ చీరలు*
అధికారులు ప్రతీ ఆడబిడ్డకు చీర చేరేలా చూడాలన్నారు. పదేళ్లు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంటుంది ..రాజకీయాలకు అతీతంగా కొడంగల్ ను అభివృద్ధి చేసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.