పున్నమి ప్రత్యేక ప్రతినిధి
భాద్రాద్రి కొత్త గూడెం జిల్లా బూర్గంపాడు వద్ద రెండు ఆర్టీసీ ఎదురు ఎదురుగా వచ్చి ఢీ కొట్టుకున్న ఘటన శుక్రవారం జరిగింది
వివరాల్లోకి వెళ్తే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక గ్రామంలో మూలమలుపు వద్ద రెండు ఆర్టీసీ బస్సులు వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఒక బస్సు భద్రాచలం నుండి ఖమ్మంకు వెళ్తుండగా, మరొకటి ఖమ్మం నుండి భద్రాచలం వైపు వస్తోంది.
రెండు బస్సులు ఒకేసారి మలుపు వద్దకు రావడంతో ప్రమాదం జరిగింది.
బస్సులో ప్రయాణికులకు స్వల్ప గాయాలవ్వడం తో వారిని
భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో తోటి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు


