*రెండవసారి వాయిదా పడ్డ ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్, చైర్మన్ ఎన్నిక*
పున్నమి న్యూస్ ప్రతినిధి
17 ఫిబ్రవరి 2026
రంగారెడ్డి జిల్లా
తెలంగాణ ఇంచార్జ్ :
చైర్మన్ ఎన్నిక అయిపోయిన తర్వాతనే ఎన్నికల అధికారికి ఫోన్ కాల్ వచ్చిందంటున్న బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు….
హైకోర్టు స్పెషల్ జిపి అడ్వకేట్ జనరల్ ఉత్తర్వుల మేరకే పాలకవర్గం ఎన్నికలు రద్దు చేశామని తెలిపిన ఆర్డీవో అనంతరెడ్డి
హైకోర్టు తీర్పు తర్వాతనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకే మరోసారి ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక
19 వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి బంధువుల పిటిషన్ తోనే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు స్టే ఆర్డర్
ఈరోజు కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఆకుల యాదగిరి కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేశారు.తనని ఎవరు కిడ్నాప్ చేయలేదని,ఆరోగ్యం సహకరించకనే హాజరు కాలేదని తెలిపారు.
తాము స్పష్టమైన మెజార్టీతో చైర్మన్ వైస్ చైర్మన్ ను ఎన్నుకుంటాం అంటున్న కాంగ్రెస్ నేతలు
తిరిగి మూడోసారి ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక…. ఎప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందో వేచి చూడాలి….. అప్పటివరకు క్యాంపుల తిప్పలు తప్పవు…




