` శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమహేంద్రవరం : జులై 26 పున్నమి ప్రతి నిధి,
భవానీ చారిటబుల్ ట్రస్టు (బీసీటీ) నిధులు సుమారు రూ. 9 లక్షలతో నిర్మించనున్న పార్కు పనులకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) శనివారం శంకుస్థాపన చేశారు. స్థానిక 43, 44 డివిజన్లకు సరిహద్దు ప్రాంతం మల్లికార్జున నగర్‌లో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుపయోగంగా ఉన్న నగర పాలక సంస్థకు చెందిన స్థలంలో స్థానిక ప్రజల కోసం ఈ పార్కు నిర్మాణం చేపట్టడం జరుగుతోందన్నారు. గతంలో ఈ డివిజన్లకు పర్యటనకు వచ్చిన నేపధ్యంలో స్థానిక మహిళలు, పిల్లలు తమకు పార్కు కావాలని విన్నవించారి, వారి కోరిక మేరకు మహిళలకు, పిల్లలకు ఉపయోగపడేలా పార్కును నిర్మించనున్నట్టు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నగరంలోని అన్ని పార్కులను అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. తమ భవానీ చారిటబుల్ ట్రస్టు తరపున విద్య, వైద్య పరంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు గుర్తు చేశారు. నగరంలోని సంపన్నులు ముందుకు వచ్చిన సమాజ సేవ చేసి వారి దాతృత్వాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. తన స్నేహితుడి సహకారంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కోక్కటి సుమారు రూ. 5 లక్షలు విలువ చేసే 6 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మల్లికార్జున నగర్‌లో పార్కు నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం అయిన తరువాత దానిని నగర పాలక సంస్థకు అప్పగిస్తామన్నారు. పి4లో భాగంగా బంగారు కుటుంబాలను మార్గ దర్శకులు దత్తత తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 250 కుటుంబాలను దత్తత తీసుకున్నారని, అవకాశం మేరకు నగరంలోని పలు బంగారు కుటుంబాలను తాను కూడా దత్తత తీసుకోనున్నట్టు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు. టీడీపీ నాయకులు కాశి నవీన్ కుమార్, వర్రే శ్రీనివాస్, రెడ్డి మణేశ్వరరావు, కంటిపూడి శ్రీనివాస్, జవ్వాది మురళి, పాలవలస వీర భద్రం, బుడ్డిగ రవి, మళ్ల వెంకట రాజు, వంజరపు శంకర్, బ్రహ్మాజీ, సంసాని ప్రసాద్, నిమిష కవి, గుదే రఘు నరేష్, కె వి శ్రీను, తుళ్లి పద్మ, శివారెడ్డి, చాపల చిన్న రాజు, అస్లాం, ఆడారిలక్ష్మి నారాయణ, దుద్దేటి నాగేంద్ర, మదినా సాహెబ్, వానపల్లి శ్రీను తదితరులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెంట ఉన్నారు.

రూ. 9 లక్షల బీసీటీ నిధులతో పార్క్ నిర్మాణం, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
` శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం : జులై 26 పున్నమి ప్రతి నిధి, భవానీ చారిటబుల్ ట్రస్టు (బీసీటీ) నిధులు సుమారు రూ. 9 లక్షలతో నిర్మించనున్న పార్కు పనులకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) శనివారం శంకుస్థాపన చేశారు. స్థానిక 43, 44 డివిజన్లకు సరిహద్దు ప్రాంతం మల్లికార్జున నగర్‌లో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుపయోగంగా ఉన్న నగర పాలక సంస్థకు చెందిన స్థలంలో స్థానిక ప్రజల కోసం ఈ పార్కు నిర్మాణం చేపట్టడం జరుగుతోందన్నారు. గతంలో ఈ డివిజన్లకు పర్యటనకు వచ్చిన నేపధ్యంలో స్థానిక మహిళలు, పిల్లలు తమకు పార్కు కావాలని విన్నవించారి, వారి కోరిక మేరకు మహిళలకు, పిల్లలకు ఉపయోగపడేలా పార్కును నిర్మించనున్నట్టు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నగరంలోని అన్ని పార్కులను అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. తమ భవానీ చారిటబుల్ ట్రస్టు తరపున విద్య, వైద్య పరంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు గుర్తు చేశారు. నగరంలోని సంపన్నులు ముందుకు వచ్చిన సమాజ సేవ చేసి వారి దాతృత్వాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. తన స్నేహితుడి సహకారంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కోక్కటి సుమారు రూ. 5 లక్షలు విలువ చేసే 6 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మల్లికార్జున నగర్‌లో పార్కు నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం అయిన తరువాత దానిని నగర పాలక సంస్థకు అప్పగిస్తామన్నారు. పి4లో భాగంగా బంగారు కుటుంబాలను మార్గ దర్శకులు దత్తత తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 250 కుటుంబాలను దత్తత తీసుకున్నారని, అవకాశం మేరకు నగరంలోని పలు బంగారు కుటుంబాలను తాను కూడా దత్తత తీసుకోనున్నట్టు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు. టీడీపీ నాయకులు కాశి నవీన్ కుమార్, వర్రే శ్రీనివాస్, రెడ్డి మణేశ్వరరావు, కంటిపూడి శ్రీనివాస్, జవ్వాది మురళి, పాలవలస వీర భద్రం, బుడ్డిగ రవి, మళ్ల వెంకట రాజు, వంజరపు శంకర్, బ్రహ్మాజీ, సంసాని ప్రసాద్, నిమిష కవి, గుదే రఘు నరేష్, కె వి శ్రీను, తుళ్లి పద్మ, శివారెడ్డి, చాపల చిన్న రాజు, అస్లాం, ఆడారిలక్ష్మి నారాయణ, దుద్దేటి నాగేంద్ర, మదినా సాహెబ్, వానపల్లి శ్రీను తదితరులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెంట ఉన్నారు.