సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
చైనా మాజీ మంత్రి టాంగ్ రెన్జియాన్కు అవినీతి ఆరోపణలపై దేశ దర్యాప్తు సంస్థలు మరణశిక్ష విధించాయి. రూ.334 కోట్ల విలువైన లంచాలు తీసుకున్నట్లు విచారణలో తేలింది. దీంతో జిలిన్ ప్రావిన్స్ కోర్టు టాంగ్పై జీవితకాల రాజకీయ నిషేధాన్ని ప్రకటించింది. ఆయన ఆస్తులను జప్తు చేయాలని, అవినీతి ద్వారా సంపాదించిన మొత్తం సొమ్మును ప్రభుత్వ ఖజానాకు అప్పగించాలని ఆదేశించింది. టాంగ్ రెన్జియాన్ ప్రభుత్వ పదవుల్లో ఉన్నప్పుడు తన హోదాను దుర్వినియోగం చేసి అధిక మొత్తంలో లాభాలు పొందినట్లు న్యాయస్థానం పేర్కొంది. చైనా అవినీతిపై తీసుకుంటున్న కఠిన చర్యలలో ఇది తాజా ఉదాహరణగా నిలిచింది.


