భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం జీవీఎంసీ 1, 2 వార్డుల్లో రూ.1.12 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
రోడ్లు, డ్రెయిన్లు వంటి సౌకర్యాల కోసం 1వ వార్డులో రూ.27 లక్షలు, 2వ వార్డులో రూ.85 లక్షలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తోందని అన్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు గాడు చిన్ని కుమారి లక్ష్మి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, భీమిలి అధ్యక్షుడు సరగడ అప్పారావు, గాడు అప్పలనాయుడు, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


