రీ కాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో జగన్ పిలుపు పై తూమాటి హర్షం జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో
చంద్రబాబు మ్యానిఫెస్టో గుర్తుకు తెస్తూ రీ కాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో అంటూ అయిదు వారాల కార్యక్రమం ప్రజా క్షేత్రంలో చేపట్టాలని జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారని ఉమ్మడి ప్రకాశం జిల్లా యమ్ యల్ సి తూమాటి మాధవరావు తెలిపారు. గురువారం వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలతో పాటు బాపట్ల పార్లమెంట్ నియోజక వర్గ పరిశీలకులు మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ తూమాటి మాధవ రావు పాల్గొన్నారు.
‘బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ’. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు. అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగడుతూ.రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో’ ‘చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ..ఆ పేరుతో వైయస్సార్‌సీపీ 5 వారాల బృహత్తర కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారని మాధవరావు తెలిపారు. పార్టీ నేతలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అత్యంత ఉత్సాహంగా ఉన్నారని ఆయన తెలిపారు.