Monday, 16 February 2026
  • Home  
  • రిటైర్ ఉపాధ్యాయ, ఉద్యోగుల బకాయి లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలి:
- జనగాం

రిటైర్ ఉపాధ్యాయ, ఉద్యోగుల బకాయి లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలి:

రిటైర్ ఉద్యోగులకు రావాల్సిన బకాయి లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలి:ఎస్జిపిఎటి —————————————- జనగామ,నవంబర్24,పున్నమి న్యూస్: గత మార్చి 2024 నుండి నేటి వరకు రిటైర్ అయిన ఉపాధ్యాయ,ఉద్యోగ పెన్షనర్లకు న్యాయంగా రావలసిన పెన్షనరీ బకాయిలు ఈ రోజు వరకు చెల్లించబడలేదు. వెంటనే బకాయిలు చెల్లించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ ( ఎస్ జి పి ఎ టి) పక్షాన 27-10-2025 రోజున అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు వందలాది పెన్షనర్లతో ధర్నా/ నిరసన ప్రదర్శన నిర్వహించి కలెక్టర్ ల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు పంపడం జరిగింది. అయినా ప్రభుత్వం నుండి స్పందన కరువైంది. పెన్షనర్స్ జె ఏ సి ఆధ్వర్యంలో 17-11-2025 నాడు వేలాది పెన్షనర్స్ తో హైదరాబాద్ ఇందిరాపార్క్,ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున మహా ధర్నా నిర్వహించినా ప్రభుత్వం నుండి ఉలుకు పలుకు లేక పోవడాన్ని పెన్షనర్స్ అసోసియేషన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. గత 19 నెలలుగా నేటి వరకు రిటైర్ అయిన ఉపాధ్యాయ,ఉద్యోగులకు వారికి సంబంధించి రావలసిన పెన్షనరీ బకాయిలు నేటివరకు జమచేయకపోవడం వలన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది పెన్షనర్లు అశువులు బాసారు,ఇంకో 16 మంది పెన్షనర్లు అనారోగ్య కారణాలతో వివిధ హాస్పిటల్ లలో చికిత్స పొందుతున్నారు. వీరంతా కూడా గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ,మా తెలంగాణ రాష్ట్రం వస్తే ,మా బతుకులు మారిపోతాయి అని జరిగిన ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నవారే . ఇటీవల రిటైర్ అయిన పెన్షనర్ ల పరిస్థితులు చూసి చలించి ప్రముఖ సామాజిక కార్యకర్త శ్రీ బక్క జడ్సన్ గత రెండు నెలలుగా అనేక వీడియో లు చేస్తూ, మరణించిన పెన్షనర్ల కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తూ , హాస్పిటల్ లలో చికిత్స పొందుతున్న పెన్షనర్స్ తో మాట్లాడుతూ, మా సమస్యలను ప్రభుత్వం దృష్టి కి తీసుకు పోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.వారు ఈ రోజు పెన్షనర్లకు మద్దతుగా వారి బకాయిలు వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వానికి సూచించాలని విజ్ఞప్తి చేయడానికి రాష్ట్ర గవర్నర్ అపాయింట్మెంట్ కొరకు రాజ్ భవన్ వద్దకు వెళ్ళిన క్రమంలో , శాంతియుతంగా గాంధేయ మార్గంలో నిరసన వ్యక్తం చేస్తున్న శ్రీ బక్క జడ్సన్ ను పోలీస్ లు అక్రమంగా అరెస్ట్ చేయడం నీచమైన చర్య అని, పోలీస్ ల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. శ్రీ బక్క జడ్సన్ ని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్ జి పి ఎ టి) రాష్ట్ర శాఖ పక్షాన ఎ.రాజేంద్ర బాబు,అధ్యక్షులు ఎం వి నర్సింగరావు,ప్రధాన కార్యదర్శి వెలిశోజు రామ మనోహర్,అదనపు ప్రధాన కార్యదర్శి బి నర్సయ్య,ఆర్థిక కార్యదర్శి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్ జి పి ఎ టి) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

రిటైర్ ఉద్యోగులకు రావాల్సిన బకాయి లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలి:ఎస్జిపిఎటి
—————————————-
జనగామ,నవంబర్24,పున్నమి న్యూస్:
గత మార్చి 2024 నుండి నేటి వరకు రిటైర్ అయిన ఉపాధ్యాయ,ఉద్యోగ పెన్షనర్లకు న్యాయంగా రావలసిన పెన్షనరీ బకాయిలు ఈ రోజు వరకు చెల్లించబడలేదు. వెంటనే బకాయిలు చెల్లించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ ( ఎస్ జి పి ఎ టి) పక్షాన 27-10-2025 రోజున అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు వందలాది పెన్షనర్లతో ధర్నా/ నిరసన ప్రదర్శన నిర్వహించి కలెక్టర్ ల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు పంపడం జరిగింది. అయినా ప్రభుత్వం నుండి స్పందన కరువైంది. పెన్షనర్స్ జె ఏ సి ఆధ్వర్యంలో 17-11-2025 నాడు వేలాది పెన్షనర్స్ తో హైదరాబాద్ ఇందిరాపార్క్,ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున మహా ధర్నా నిర్వహించినా ప్రభుత్వం నుండి ఉలుకు పలుకు లేక పోవడాన్ని పెన్షనర్స్ అసోసియేషన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము.
గత 19 నెలలుగా నేటి వరకు రిటైర్ అయిన ఉపాధ్యాయ,ఉద్యోగులకు వారికి సంబంధించి రావలసిన పెన్షనరీ బకాయిలు నేటివరకు జమచేయకపోవడం వలన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది పెన్షనర్లు అశువులు బాసారు,ఇంకో 16 మంది పెన్షనర్లు అనారోగ్య కారణాలతో వివిధ హాస్పిటల్ లలో చికిత్స పొందుతున్నారు.
వీరంతా కూడా గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ,మా తెలంగాణ రాష్ట్రం వస్తే ,మా బతుకులు మారిపోతాయి అని జరిగిన ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నవారే .
ఇటీవల రిటైర్ అయిన పెన్షనర్ ల పరిస్థితులు చూసి చలించి ప్రముఖ సామాజిక కార్యకర్త శ్రీ బక్క జడ్సన్ గత రెండు నెలలుగా అనేక వీడియో లు చేస్తూ, మరణించిన పెన్షనర్ల కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తూ , హాస్పిటల్ లలో చికిత్స పొందుతున్న పెన్షనర్స్ తో మాట్లాడుతూ, మా సమస్యలను ప్రభుత్వం దృష్టి కి తీసుకు పోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.వారు ఈ రోజు పెన్షనర్లకు మద్దతుగా వారి బకాయిలు వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వానికి సూచించాలని విజ్ఞప్తి చేయడానికి రాష్ట్ర గవర్నర్ అపాయింట్మెంట్ కొరకు రాజ్ భవన్ వద్దకు వెళ్ళిన క్రమంలో , శాంతియుతంగా గాంధేయ మార్గంలో నిరసన వ్యక్తం చేస్తున్న శ్రీ బక్క జడ్సన్ ను పోలీస్ లు అక్రమంగా అరెస్ట్ చేయడం నీచమైన చర్య అని, పోలీస్ ల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. శ్రీ బక్క జడ్సన్ ని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్ జి పి ఎ టి) రాష్ట్ర శాఖ పక్షాన
ఎ.రాజేంద్ర బాబు,అధ్యక్షులు
ఎం వి నర్సింగరావు,ప్రధాన కార్యదర్శి
వెలిశోజు రామ మనోహర్,అదనపు ప్రధాన కార్యదర్శి
బి నర్సయ్య,ఆర్థిక కార్యదర్శి
స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్ జి పి ఎ టి) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.