🔸 రిటైర్డ్ టీచర్ ఏటీఎం కార్డు మార్చి రూ.75,000 మాయం – అపరిచితుడు రాజంపేటకి పరార్అ
న్నమయ్య జిల్లా నందలూరు మండలం అరవపల్లి గ్రామంలో ఓ అపరిచితుడు చాణుపాటి నరసింహులు అనే రిటైర్డ్ టీచర్ ATM కార్డు మార్పిడి చేసి రూ.75,000 మాయం చేశాడు. ఎపీజీ బ్యాంకు ఏటీఎంలో మాటల్లో పెట్టి కార్డు మార్చిన దొంగ, నందలూరు బస్ స్టాండ్ వద్ది ఎస్బీఐ ఏటీఎం ద్వారా మూడు సార్లు నగదు డ్రా చేసి ఆటోలో రాజంపేటకు పారిపోయాడు. సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.