Sunday, 7 December 2025
  • Home  
  • రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీ ఇంటికే ‘స్మార్ట్ రేషన్ కార్డు’ – జస్ట్ రూ. 35 చెలిస్తే చాలు..!
- ఆంధ్రప్రదేశ్

రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీ ఇంటికే ‘స్మార్ట్ రేషన్ కార్డు’ – జస్ట్ రూ. 35 చెలిస్తే చాలు..!

సెప్టెంబర్ 16 పున్నమి ప్రతినిధి @ ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతోంది. అయితే లబ్ధిదారులకు మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. స్మార్ట్ రేషన్ కార్డులు రానివారికి రిజిస్టిర్ పోస్టు ద్వారా అందజేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో లబ్ధిదారులు కార్డులను అందుకుంటున్నారు. ప్రతి నెలా 29,796 రేషన్ షాపుల ద్వారా తెల్లరేషన్ కార్డులదారులకు బియ్యం, తదితర సరుకుల పంపిణీ చేయడం జరుగుతుందని ఇటీవలనే పౌరసరఫరాల శాఖ తెలిపింది. అయితే లబ్ధిదారులకు మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. స్మార్ట్ రేషన్ కార్డులు రానివారికి రిజిస్టిర్ పోస్టు ద్వారా అందజేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. నవంబర్ 1వ తేదీ నుంచి రిజిస్టర్ పోస్ట్ ద్వారా స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తారు. నామినల్ ఫీజు కింద రూ. 35 చెల్లిస్తే పోస్టల్ శాఖ ద్వారా రిజిస్టర్ పోస్టులో ఇంటికి పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికైతే ప్రస్తుతం కార్డులు రాలేదో వారికి మాత్రమే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కార్డులను అందజేస్తారు. మరోవైపు రేషన్ కార్డులో మార్పులు చేయాల్సి వస్తే.. సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. మార్పులు చేర్పులు దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఈలోపే దరఖాస్తు పెట్టుకోవాలి. మీరు సమర్పించే వివరాల ఆధారంగా అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసే కార్డులను కూడా ఉచితంగానే అందించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. కాబట్టి తప్పులు ఉన్న వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వచ్చే వారం నుంచి మన మిత్ర యాప్ లో కూడా కార్డులో మార్పులకు దరఖాస్తు చేసుకునే వీలు రానుంది. 9552300009 కు హాయ్ అని మెసేజ్ చేసి మనమిత్ర సేవలను పొందవచ్చు మరోవైపు మూడు నెలలు వరుసగా రేషన్ తీసుకోకుంటే రేషన్ కార్డు రద్దు అవుతుంది. కాని ఆ తర్వాత సచివాలయాలకు వెళ్లి సరైన సమాచారం ఇస్తే… మళ్లీ రేషన్ కార్డు యాక్టివేట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు.

సెప్టెంబర్ 16 పున్నమి ప్రతినిధి @
ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతోంది. అయితే లబ్ధిదారులకు మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. స్మార్ట్ రేషన్ కార్డులు రానివారికి రిజిస్టిర్ పోస్టు ద్వారా అందజేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది.
ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో లబ్ధిదారులు కార్డులను అందుకుంటున్నారు. ప్రతి నెలా 29,796 రేషన్ షాపుల ద్వారా తెల్లరేషన్ కార్డులదారులకు బియ్యం, తదితర సరుకుల పంపిణీ చేయడం జరుగుతుందని ఇటీవలనే పౌరసరఫరాల శాఖ తెలిపింది.
అయితే లబ్ధిదారులకు మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. స్మార్ట్ రేషన్ కార్డులు రానివారికి రిజిస్టిర్ పోస్టు ద్వారా అందజేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది.
నవంబర్ 1వ తేదీ నుంచి రిజిస్టర్ పోస్ట్ ద్వారా స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తారు. నామినల్ ఫీజు కింద రూ. 35 చెల్లిస్తే పోస్టల్ శాఖ ద్వారా రిజిస్టర్ పోస్టులో ఇంటికి పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎవరికైతే ప్రస్తుతం కార్డులు రాలేదో వారికి మాత్రమే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కార్డులను అందజేస్తారు. మరోవైపు రేషన్ కార్డులో మార్పులు చేయాల్సి వస్తే.. సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
మార్పులు చేర్పులు దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఈలోపే దరఖాస్తు పెట్టుకోవాలి. మీరు సమర్పించే వివరాల ఆధారంగా అప్డేట్ చేస్తారు.
అప్డేట్ చేసే కార్డులను కూడా ఉచితంగానే అందించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. కాబట్టి తప్పులు ఉన్న వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
వచ్చే వారం నుంచి మన మిత్ర యాప్ లో కూడా కార్డులో మార్పులకు దరఖాస్తు చేసుకునే వీలు రానుంది. 9552300009 కు హాయ్ అని మెసేజ్ చేసి మనమిత్ర సేవలను పొందవచ్చు
మరోవైపు మూడు నెలలు వరుసగా రేషన్ తీసుకోకుంటే రేషన్ కార్డు రద్దు అవుతుంది. కాని ఆ తర్వాత సచివాలయాలకు వెళ్లి సరైన సమాచారం ఇస్తే… మళ్లీ రేషన్ కార్డు యాక్టివేట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.