Monday, 23 March 2026
  • Home  
  • రాష్ట్ర స్థాయి సౌత్ జోన్ సీనియర్ మహిళల షూటింగ్ బాల్ పోటీలో సత్తాచాటిన పాలమూరు అమ్మాయి..
- జోగులాంబ గద్వాల

రాష్ట్ర స్థాయి సౌత్ జోన్ సీనియర్ మహిళల షూటింగ్ బాల్ పోటీలో సత్తాచాటిన పాలమూరు అమ్మాయి..

జోగులాంబ గద్వాల్ ఫిబ్రవరి 2(పున్నమి ప్రతినిధి) జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలం చిన్నతండ్రపాడు గ్రామం మారుమూల గ్రామానికి చెందిన కూలి పని చేసే అతి పేద కుటుంబం సుధాకర్ ఎలిజిబెత్ మూడవ కూతురు సువర్ణ గత జనవరి 17, 18 తేదీలలో వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో జరిగిన రాష్ట్రస్థాయి సౌత్ జోన్ సీనియర్ మహిళల షూటింగ్ బాల్ పోటీలలో ఉమ్మడి మహబూబ్నగర్ మహిళా జట్టులో పాల్గొని, క్రీడా నైపుణ్యతను, క్రీడా ప్రతిభను చాటి వెండి పతకం సాధించి, జాతీయస్థాయి సీనియర్ మహిళల షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు రాష్ట్ర షూటింగ్ బాల్ ఉపాధ్యక్షుడు కోచ్ బి. గోపాలం ద్వారా సమాచారం అందినట్లు తండ్రి సుధాకర్ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, విలేకరుల సమావేశంలో తెలిపారు. జాతీయస్థాయి సీనియర్ మహిళల షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైన సువర్ణ ఫిబ్రవరి 6 నుండి 9 వరకు ఆంధ్రప్రదేశ్, తిరుపతిలో జరుగు జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటుందని కోచ్ బి.గోపాలం తెలిపారు. అలాగే 2025 సెప్టెంబర్ 22 నుండి 24 వరకు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు లో జరిగిన జూనియర్ షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొని కాంస్య పథకం, మెరిట్ సర్టిఫికెట్ పొందినది . అలాగే 2025 డిసెంబర్ 14న తాండూర్ పట్టణంలో జరిగిన అస్మిత ఖే లో ఇండియా షూటింగ్ బాల్ మహిళల పోటీలలో పాల్గొని జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైనది .వచ్చే ఏప్రిల్ నెలలో ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో జరుగు జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొంటుంది. 2025 డిసెంబర్ 29 నుండి 31 వరకు వరంగల్ జిల్లా అన్నారం లో జరిగిన సీనియర్ మహిళా షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొని, మహబూబ్నగర్ జట్టు గెలుపునకు కృషిచేసి వెండి పతకము, ప్రశంసా పత్రం సాధించినది అని కోచ్ బి. గోపాలం తెలిపారు. సువర్ణ ప్రస్తుతము మహబూబ్నగర్ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాలలో BA 2వ సంవత్సరం చదువుతున్నది. , రాష్ట్ర షూటింగ్ బాల్ ఉపాధ్యక్షుడు కోచ్ బి.గోపాలం ప్రోత్సాహము, సహకారంతో రాష్ట్ర ,జాతీయస్థాయి క్రీడలలో రాణిస్తూ తాండ్ర పాడు గ్రామ కీర్తి ప్రతిష్టలను పెంచుచున్నది. సువర్ణ మాట్లాడుతూ మా తల్లిదండ్రుల కష్టాన్ని శ్రమను గుర్తించి నేను బాగా చదివి ,క్రీడల్లో రాణించి కోచ్ గోపాల్ సార్ సహకారంతో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించాలని నా ప్రధమ కర్తవమనిఆమె తెలిపినది. జాతీయస్థాయి షూటింగ్ బాల్ క్రీడలకు ఎంపికైన సువర్ణను రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.గోపాలం, కళాశాల ప్రిన్సిపల్ జయప్రద, ఫిజికల్ డైరెక్టర్ రజిని ,గ్రామ సర్పంచ్ ,వార్డు సభ్యులు, పెద్దలు, ప్రజలు అభినందించారు..

జోగులాంబ గద్వాల్ ఫిబ్రవరి 2(పున్నమి ప్రతినిధి)
జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలం చిన్నతండ్రపాడు గ్రామం మారుమూల గ్రామానికి చెందిన కూలి పని చేసే అతి పేద కుటుంబం సుధాకర్ ఎలిజిబెత్ మూడవ కూతురు సువర్ణ గత జనవరి 17, 18 తేదీలలో వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో జరిగిన రాష్ట్రస్థాయి సౌత్ జోన్ సీనియర్ మహిళల షూటింగ్ బాల్ పోటీలలో ఉమ్మడి మహబూబ్నగర్ మహిళా జట్టులో పాల్గొని, క్రీడా నైపుణ్యతను, క్రీడా ప్రతిభను చాటి వెండి పతకం సాధించి, జాతీయస్థాయి సీనియర్ మహిళల షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు రాష్ట్ర షూటింగ్ బాల్ ఉపాధ్యక్షుడు కోచ్ బి. గోపాలం ద్వారా సమాచారం అందినట్లు తండ్రి సుధాకర్ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, విలేకరుల సమావేశంలో తెలిపారు. జాతీయస్థాయి సీనియర్ మహిళల షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైన సువర్ణ ఫిబ్రవరి 6 నుండి 9 వరకు ఆంధ్రప్రదేశ్, తిరుపతిలో జరుగు జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటుందని కోచ్ బి.గోపాలం తెలిపారు. అలాగే 2025 సెప్టెంబర్ 22 నుండి 24 వరకు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు లో జరిగిన జూనియర్ షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొని కాంస్య పథకం, మెరిట్ సర్టిఫికెట్ పొందినది . అలాగే 2025 డిసెంబర్ 14న తాండూర్ పట్టణంలో జరిగిన అస్మిత ఖే లో ఇండియా షూటింగ్ బాల్ మహిళల పోటీలలో పాల్గొని జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైనది .వచ్చే ఏప్రిల్ నెలలో ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో జరుగు జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొంటుంది. 2025 డిసెంబర్ 29 నుండి 31 వరకు వరంగల్ జిల్లా అన్నారం లో జరిగిన సీనియర్ మహిళా షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొని, మహబూబ్నగర్ జట్టు గెలుపునకు కృషిచేసి వెండి పతకము, ప్రశంసా పత్రం సాధించినది అని కోచ్ బి. గోపాలం తెలిపారు. సువర్ణ ప్రస్తుతము మహబూబ్నగర్ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాలలో BA 2వ సంవత్సరం చదువుతున్నది. , రాష్ట్ర షూటింగ్ బాల్ ఉపాధ్యక్షుడు కోచ్ బి.గోపాలం ప్రోత్సాహము, సహకారంతో రాష్ట్ర ,జాతీయస్థాయి క్రీడలలో రాణిస్తూ తాండ్ర పాడు గ్రామ కీర్తి ప్రతిష్టలను పెంచుచున్నది. సువర్ణ మాట్లాడుతూ మా తల్లిదండ్రుల కష్టాన్ని శ్రమను గుర్తించి నేను బాగా చదివి ,క్రీడల్లో రాణించి కోచ్ గోపాల్ సార్ సహకారంతో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించాలని నా ప్రధమ కర్తవమనిఆమె తెలిపినది. జాతీయస్థాయి షూటింగ్ బాల్ క్రీడలకు ఎంపికైన సువర్ణను రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.గోపాలం, కళాశాల ప్రిన్సిపల్ జయప్రద, ఫిజికల్ డైరెక్టర్ రజిని ,గ్రామ సర్పంచ్ ,వార్డు సభ్యులు, పెద్దలు, ప్రజలు అభినందించారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.