రాష్ట్ర స్థాయి కిక్‌బాక్సింగ్ పోటీల ప్రారంభం: ఎంపీ డీకే అరుణ.
మహబూబ్‌నగర్‌లో రాష్ట్ర స్థాయి కిక్‌బాక్సింగ్ పోటీలను పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “పాలమూరు ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటాలని, ప్రతి చిన్నారి పోటీలలో మెలకువ చూపించి విజయాలు సాధించాలి” అని ఆకాంక్షించారు. గ్రామీణ క్రీడాకారులను ఖేలో ఇండియా పథకం ద్వారా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు, కార్యదర్శి మహిపాల్, జిల్లా అధ్యక్షులు రవికుమార్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.