
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖపట్నం నావెల్ కోస్ట్ హెలిప్యాడ్ కు విచ్చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పి.వి.జి. కుమార్ ముఖ్యమంత్రిని ఆత్మీయంగా ఆహ్వానించి, పుష్పగుచ్ఛం అందజేశారు.
ముఖ్యమంత్రిని అభివాదిస్తూ పి.వి.జి. కుమార్ రాష్ట్ర అభివృద్ధి దిశగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కొనియాడారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల సదుపాయాలు, పరిశ్రమల ప్రోత్సాహం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధానాలు ప్రజలందరికీ మేలుచేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా పి.వి.జి. కుమార్ మాట్లాడుతూ – “తెలుగు రాష్ట్రం ప్రగతి మార్గంలో ముందుకు సాగేందుకు చంద్రబాబు నాయకత్వం అపూర్వమైంది. రాష్ట్రాన్ని అభివృద్ధి శిఖరాలకు తీసుకెళ్లడంలో ఆయన చూపిస్తున్న కృషి ప్రతి ఒక్కరికీ గర్వకారణం” అని అన్నారు.
ముఖ్యమంత్రితో జరిగిన ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు కూడా పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు

