అమరావతి : (పున్నమి ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంతరిక్ష సాంకేతిక సలహాదారుగా నియమితులైన డా. ఎస్. శ్రీధర పణిక్కర్ సోమనాథ్ తన పదవికి రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తొమ్మిది నెలల క్రితం నియమితులైనప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి బాధ్యతలు, కార్యాలయం కేటాయించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్పేస్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు వచ్చిన సోమనాథ్‌ను పట్టించుకోకపోవడం ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చగా మారే అవకాశముందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


