ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి @
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఒక నకిలీ జీవో ను సృష్టించిన కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
జీవో ఆర్టీ నెం.1575 తేదీ 29-08-2025న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ప్రచారం అవుతున్న ఈ జీవో నకిలీది.
ఇందులో 62 సంవత్సరాల నుంచి పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఉన్నది.
అయితే వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఆర్టీ నెం 1545 తేదీ 22-08-2025న విడుదల చేసింది.
ఈ వాస్తవ జీవోలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతున్నట్లుగా మాత్రమే ఉన్నది.
దురుద్దేశపూర్వకంగా కొందరు వ్యక్తులు తప్పుడు జీవోను సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులలో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇలా ప్రభుత్వ ఉత్తర్వులను కూడా నకిలీవి సృష్టించి ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది.


