రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నదని కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా మధిర రూరల్ మండలం మాటూరు రెవిన్యూ పరిధిలో దశాబ్దాలుగా బలహీనవర్గాలు షెడ్యూల్ కులాలు సాగు చేసుకుంటున్న భూములు కెసిఆర్ ప్రభుత్వ హయాంలో సుమారు 200 ఎకరాలకు పైగా భూములు ధరణి పోర్టల్ తప్పుల కారణంగా వక్ఫ్ భూములుగా నమోదు అయిన నేపథ్యంలో రైతులు న్యాయస్థానంలో న్యాయపోరాటం చేస్తున్నారు . ఈ క్రమంలో నాగపూర్ అమరావతి జాతీయ రహదారి విస్తరణలో సుమారు పది ఎకరాల భూమి రహదారి విస్తరణ పనులకు సేకరించిన నేపథ్యంలో రైతులు పరిహారం ఇప్పించాలని అధికారులకు మొరపెట్టుకున్న టైటిల్ డిస్ప్యూట్ పెండింగ్ ఉన్నదని తెలిసినా అధికార యంత్రాంగం కేంద్రం సదరు భూములకు ఇచ్చిన పరిహారాన్ని వక్ఫ్ బోర్డు లో ఏక పక్షం గా జమ చేయడం దుర్మార్గం అని అన్నారు.నిబంధనలకు విరుద్ధం . ప్రాజెక్టు విస్తరణలో భూములు కోల్పోయి పరిహారం అందక రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం ధరణి పోర్టల్ లో తప్పులు దొర్లాయని వాటన్నిటిని సరిదిద్ది వాస్తవమైన హక్కుదారులకు పట్టాలిస్తామని చెప్పి ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం ఉదారంగా వ్యవహరించి ఇచ్చినటువంటి న్యాయమైన పరిహారాన్ని సుమారు రెండు కోట్ల రూపాయలను అనాలోచితంగా వక్ఫ్ బోర్డులో ఎలా జమ చేశారో చెప్పాలన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి కేంద్రం ఇచ్చిన పరిహారాన్ని వాస్తవ రైతులకు ఇవ్వాలని కొండపల్లి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేసారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతు ల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహారిస్తుంది కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి