July21 పున్నమి న్యూస్
*శ్రీశైలం లో ఉన్న దేవ బ్రాహ్మణ గాయత్రి పీఠం పునః ప్రారంభం కొరకు కృషి చేస్తాను ఉపాధ్యక్షులు అంబాబత్తుల అండకొండరాముడు రాముడు*
బాపట్ల జిల్లా , చీరాల మండలం, ఆమోదగిరి పట్టణం లో ఆంధ్రప్రదేశ్ దేవ బ్రాహ్మణ పండిత అర్చక పురోహిత పరిషత్ చతుర్ధ వార్షిక సర్వసభ్య సమావేశం కార్యక్రమంలో కార్యవర్గ సభ్యుల ఎన్నికలో రాయలసీమ ప్రాంతం నుంచి ఉపాధ్యక్షు పదవికి అంబా బత్తుల అండకొండరాముడు నీ షణ్ముఖ ప్రతిపాదించగా దేవ బ్రాహ్మణ పండిత అర్చక పురోహిత పరిషత్ సభ్యులందరూ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఆమోదించి ఎన్నుకోవడం జరిగిందని తదనానంతరం దేవ బ్రాహ్మణ పండిత అర్చక పురోహిత పరిషత్ అధ్యక్షులు మాన్యశ్రీ చల్లా.రామారావు,శుభాకాంక్షలు ఆశీస్సులు అందజేశారు, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నా గురువర్యులు బ్రహ్మశ్రీ జన రుద్ర రామలింగేశ్వర రావు మరియు దేవా బ్రాహ్మణులు శాలువా పూలదండతో ఘనంగా సత్కరించి వేద ఆశీర్వాదం అందజేశారు. అంబాబత్తుల అండకొండ రాముడు ఆంధ్ర ప్రదేశ్ దేవబ్రాహ్మణ పండిత అర్చక పురోహితు పరిషత్ ఉపాధ్యక్షుడు గా ఎన్నికైన వెంటనే , దేవ బ్రాహ్మణుల చీరా కాల ఆశయం అయినా రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లా శ్రీశైలం లో ఉన్న దేవ బ్రాహ్మణ గాయత్రి పీఠము పునః ప్రారంభం కొరకు అధ్యక్షు వర్యులైన మాన్యశ్రీ చల్లా రామారావు ఆధ్వర్యంలో ఛాయ శక్తుల పనిచేస్తానని దేవ బ్రాహ్మణ పండిత అర్చక పురోహిత పరిషత్ చతుర్ధ సర్వసభ్య సమావేశంలో తెలియపరిచారు,దేవ బ్రాహ్మణులు అందరూ సంతోషం వ్యక్తపరుస్తూ , ఎటువంటి ఆటంకాలు కలుక్కోకుండా సజావుగా అన్నిట్లో విజయం కలుగుటకు నూతన కార్యవర్గ అధికారులకు ,సభ్యులకి దేవ బ్రాహ్మణలు వేద ఆశీర్వాదం అందించడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దేవ బ్రాహ్మణులు పాల్గొని దేవ బ్రాహ్మణ పండిత అర్చక పురోహిత పరిషత్ చతుర్ద సర్వ సభ్య సమావేశం మును విజయవంతం చేశారు అని ఉపాధ్యక్షులు అంబాబత్తుల అండకొండ రాముడు, తెలుపుతూ దేవ బ్రాహ్మణ పండిత అర్చక పురోహిత పరిషత్ కి సేవ చేసుకునే భాగ్యాన్ని బాధ్యతను ఇచ్చిన అధ్యక్షవర్యులు చల్లా రామారావు కు దేవ బ్రాహ్మణ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దేవ బ్రాహ్మణ ల అభివృద్ధి కొరకు అభ్యున్నతి కొరకు ఎల్లవేళలా కృషి చేస్తానని పత్రికా ముఖంగా తెలియజేశారు.