*విశాఖపట్నం డిసెంబర్ 12 పున్నమి ప్రతినిధి*
రాష్ట్ర ఎక్సైజ్ మరియు భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆయా శాఖ అధికారులతో ఈరోజు విశాఖపట్నంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారుల పనితీరు ఫలితాలు గురించి తెలుసుకున్నారు. విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లా ఎక్సైజ్ అధికారులతో ఏడాది కాలం పనితీరు గురించి సమీక్ష చేశారు. అక్రమ మద్యం నివారించడంలో అందరూ గట్టిగా కృషి చేయాలని సూచించారు. బెల్ట్ షాపులపై ఉక్కు పాదం మోపాలని, నాటు సారా, కల్తీ మద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని అధికారులకు ఆదేశం జారీ చేశారు. అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ లు, ఇతర అధికారులు పాల్గొన్నారు

రాష్ట్ర ఎక్సైజ్ మరియు భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆయా శాఖ అధికారులతో ఈరోజు విశాఖపట్నంలో సమీక్ష సమావేశం నిర్వహించారు
*విశాఖపట్నం డిసెంబర్ 12 పున్నమి ప్రతినిధి* రాష్ట్ర ఎక్సైజ్ మరియు భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆయా శాఖ అధికారులతో ఈరోజు విశాఖపట్నంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారుల పనితీరు ఫలితాలు గురించి తెలుసుకున్నారు. విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లా ఎక్సైజ్ అధికారులతో ఏడాది కాలం పనితీరు గురించి సమీక్ష చేశారు. అక్రమ మద్యం నివారించడంలో అందరూ గట్టిగా కృషి చేయాలని సూచించారు. బెల్ట్ షాపులపై ఉక్కు పాదం మోపాలని, నాటు సారా, కల్తీ మద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని అధికారులకు ఆదేశం జారీ చేశారు. అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ లు, ఇతర అధికారులు పాల్గొన్నారు

