సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @
పవన్ కళ్యాణ్ గత రెండు రోజులుగా జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు
జ్వరంతోనే సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు, అధికారులతో సమీక్షలు నిర్వహించారు.
సోమవారం రాత్రి నుంచి జ్వరం తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో వైద్యులు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు. విశ్రాంతి అవసరమని సూచించారు. జ్వరంతో ఇబ్బందిపడుతూనే శాఖాపరమైన విషయాలపై అధికారులతో టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించారు


