పున్నమి ప్రతినిధి 18 మార్చి 2026 రామచంద్రపురం
రామచంద్రపురం మండలం కొత్త వేపకుప్పం పంచాయతీ రైతు సేవా కేంద్రం వద్ద పశుసంవర్ధక శాఖ ద్వారా రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మండలఅధ్యక్షులు తిరుమలరెడ్డి మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు పులివర్తి నాని రైతుల అభివృద్ధికి త్వరలో మినీ గో కులాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. రైతులకు మినరల్ మిక్చర్, మల్టీ విటమిన్ సిరప్, పంపిణీ చేయడం జరిగింది. వేయదూడల ప్రదర్శనలు మొదటి బహుమతి రేవతి, రెండవ బహుమతి పాపిరెడ్డి, మూడవ బహుమతి సుబ్రహ్మణ్యం రెడ్డి కీ పాల క్యారియర్లు మినరల్ మిక్చారు మల్టీ విటమిన్ సిరపులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆవుల ప్రసాద్, వెటర్నరీ డాక్టర్లు భువనేశ్వరి, జయ కృష్ణ,కిరణ్, టిడిపి నాయకులు చిన్న స్వామి రెడ్డి, బండి విజయ్ కుమార్ రెడ్డి, పంతల వెంకటేష్ రాయల్, జోహార్, తదితరులు పాల్గొన్నారు



