పాఠశాల క్రీడా పోటీలలో భాగంగా నిర్వహించిన కబడ్డీ జట్టు ఎంపికలో, మండలంలోని శ్రీ అన్నమాచార్య అకాడమీ విద్యార్థి చాపల్లి దుర్గా అశోక్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ సమ్మెట శివప్రసాద్ తెలిపారు.
గురువారం కోడూరులో జరిగిన జిల్లా జట్టు ఎంపిక పోటీల్లో ఉమ్మడి కడప జిల్లా నుంచి 100 మంది విద్యార్థులు పాల్గొనగా, అండర్–14 విభాగంలో ప్రతిభ కనబరిచి దుర్గా అశోక్ రాష్ట్ర జట్టుకు ఎంపిక కావడం విశేషమని ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో కరస్పాండెంట్, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థి సాధించిన ఈ విజయం పాఠశాలకు గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలాంజనేయులు, డైరెక్టర్లు మాడపూరి హేమలత, సమ్మెట ఉమామహేష్, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకట మధు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


