Tuesday, 24 March 2026
  • Home  
  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు శుభవార్త! ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనం
- ఆంధ్రప్రదేశ్

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు శుభవార్త! ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనం

ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాలతో దూసుకుపోతుంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. అంతేకాదు సూపర్ సిక్స్ పథకం అమలులో ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు శుభవార్త అందించింది. ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలను అందించాలని నిర్ణయించింది. 70% వైకల్యం ఉన్నవారు..18-45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు.. పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ పథకానికి అర్హులు. అర్హత కలిగినవారు అక్టోబర్ 31 లోపు www.apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. గతంలో దరఖాస్తు చేసుకుని ఆమోదం పొందని వారు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రభుత్వం పేర్కొంది. దివ్యాంగులకు త్రిచక్ర బైక్‌లు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలను అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్లీ గిఫ్టెడ్ అండ్ సీనియర్ సిటిజన్స్ కోఆపరేటివ్ సొసైటీ (APDASCAC) మార్గదర్శకాలను విడుదల చేసింది. అర్హత కలిగిన వారు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకానికి అర్హతలు ఇవే 1. ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత నివాసి అయి ఉండాలి. 2. 18 నుండి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులు. 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం కలిగి ఉండాలి. 3. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 4. వార్షిక ఆదాయం రూ. 3 లక్షల కంటే తక్కువగా ఉండాలి. 5. లబ్ధిదారుల ఎంపికకు 2 నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 6. సొంత వాహనం ఉన్నవారికి వర్తించదు. 7. గతంలో ఈ పథకం కంద వాహనాలు తీసుకోకూడదు. దరఖాస్తు చేసుకునేటప్పుడు కావాల్సిన అవసరమైన పత్రాలు 1. ఆధార్ కార్డు, 2. జిల్లా వైద్య బోర్డు జారీ చేసిన అర్హత ధృవీకరణ పత్రం. 3. SSC సర్టిఫికేట్ (టెన్త్ సర్టిఫికేట్), 4. SC, ST అయితే కుల ధృవీకరణ పత్రం, 5. వికలాంగుల పూర్తి పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్. 6. ఆదాయ ధృవీకరణ పత్రం (01-01-2022 తర్వాత తీసుకోవాలి) 7. బోనఫైడ్ సర్టిఫికేట్ (విద్యార్థి అయితే) 8. ముందుగా వాహనం తీసుకోలేదని మరియు అన్ని వివరాలు సరిగ్గా ఇవ్వబడిందని స్వీయ ప్రకటన. రిజర్వేషన్ మహిళలు – 50% పురుషులు – 50% SC-16% ST -7% జనరల్ – 77% ప్రాధాన్యత 1. PG విద్యార్థులు 2. స్వీయ/వేతనం/జీతం డిగ్రీ హోల్డర్లు చివరి తేదీ: అక్టోబర్ 31 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు విధానం www.apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయండి. చివరి తేదీకి ముందు దరఖాస్తు చేసుకుంటే.. ప్రభుత్వం అర్హతలను తనిఖీ చేసి అర్హుల జాబితాను ప్రకటిస్తుంది.. వారికి మూడు చక్రాల మోటారు వాహనాన్ని అందిస్తారు.

ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాలతో దూసుకుపోతుంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం.

అంతేకాదు సూపర్ సిక్స్ పథకం అమలులో ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు శుభవార్త అందించింది. ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలను అందించాలని నిర్ణయించింది. 70% వైకల్యం ఉన్నవారు..18-45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు.. పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ పథకానికి అర్హులు. అర్హత కలిగినవారు అక్టోబర్ 31 లోపు www.apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. గతంలో దరఖాస్తు చేసుకుని ఆమోదం పొందని వారు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రభుత్వం పేర్కొంది.

దివ్యాంగులకు త్రిచక్ర బైక్‌లు
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలను అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్లీ గిఫ్టెడ్ అండ్ సీనియర్ సిటిజన్స్ కోఆపరేటివ్ సొసైటీ (APDASCAC) మార్గదర్శకాలను విడుదల చేసింది. అర్హత కలిగిన వారు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఈ పథకానికి అర్హతలు ఇవే

1. ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత నివాసి అయి ఉండాలి.

2. 18 నుండి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులు. 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం కలిగి ఉండాలి.

3. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

4. వార్షిక ఆదాయం రూ. 3 లక్షల కంటే తక్కువగా ఉండాలి.

5. లబ్ధిదారుల ఎంపికకు 2 నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

6. సొంత వాహనం ఉన్నవారికి వర్తించదు.

7. గతంలో ఈ పథకం కంద వాహనాలు తీసుకోకూడదు.

దరఖాస్తు చేసుకునేటప్పుడు కావాల్సిన అవసరమైన పత్రాలు

1. ఆధార్ కార్డు,

2. జిల్లా వైద్య బోర్డు జారీ చేసిన అర్హత ధృవీకరణ పత్రం.

3. SSC సర్టిఫికేట్ (టెన్త్ సర్టిఫికేట్),

4. SC, ST అయితే కుల ధృవీకరణ పత్రం,

5. వికలాంగుల పూర్తి పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్.

6. ఆదాయ ధృవీకరణ పత్రం (01-01-2022 తర్వాత తీసుకోవాలి)

7. బోనఫైడ్ సర్టిఫికేట్ (విద్యార్థి అయితే)

8. ముందుగా వాహనం తీసుకోలేదని మరియు అన్ని వివరాలు సరిగ్గా ఇవ్వబడిందని స్వీయ ప్రకటన.

రిజర్వేషన్
మహిళలు – 50%
పురుషులు – 50%
SC-16%
ST -7%
జనరల్ – 77%

ప్రాధాన్యత

1. PG విద్యార్థులు

2. స్వీయ/వేతనం/జీతం డిగ్రీ హోల్డర్లు

చివరి తేదీ:
అక్టోబర్ 31 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు విధానం
www.apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయండి. చివరి తేదీకి ముందు దరఖాస్తు చేసుకుంటే.. ప్రభుత్వం అర్హతలను తనిఖీ చేసి అర్హుల జాబితాను ప్రకటిస్తుంది.. వారికి మూడు చక్రాల మోటారు వాహనాన్ని అందిస్తారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.