*అఖిల భారత విద్యార్థి సమైక్య (AISF)**
*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించారు.
పెండింగ్లో ఉన్న 6,400 ఫీజ్ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలి.
పి.పి.పి పేరుతో ప్రభుత్వ 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయాలనే ఆలోచన వీడాలి.
ప్రభుత్వ ఎస్సీ ,ఎస్టీ ,బిసి సంక్షేమ హాస్టల్ లో మౌలిక వసతులు కల్పించి ప్రతి శాశ్వత భవనాలు కేటాయించి వార్డెన్ ,కుక్, ట్యూటర్ పోస్టులు భర్తీ చెయ్యాలి.
సంక్షేమ హాస్టల్ లో ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఇదే విద్యార్థికి నెలకి 3000 రూపాయలు మెస్ ఛార్జీలు పెంచాలి.
*విశాఖ స్టీల్ ప్లాంట్ :*
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సు యాత్ర సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఆంధ్ర కేసరి సెమినార్ హాల్ లో ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలపై అవగాహన సదస్సు *ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉల్లం.నాగరాజు అధ్యక్షతన* నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా *ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి కె. రామాంజనేయులు* పాల్గొని రాష్ట్రంలో విద్యారంగం మొత్తం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తుందని అందులో భాగంగానే 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారని విమర్శించారు. ఇలా విద్యావ్యవస్థ ప్రైవేటీకరణ అయితే పేద, బడుగు బలహీన వర్గాల పిల్లలు పూర్తిగా చదువుకు దూరం అవుతారన్నారు.
*ఏ.ఐ.టి.యు.సి జాతీయ ఉపాధ్యక్షులు విశాఖ ఉక్కు పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణ గారు* మాట్లాడుతూ విశాఖ ఉక్కు అనేకమంది పోరాట త్యాగాల ఫలితంగా ఏర్పడిందని ఇటువంటి ఉక్కుకి సంతకడులో కేటాయించకుండా నష్టాల్లో ఉంది అని ప్రజలను నమ్మిస్తూ ప్రైవేటీకరణ చేసిందని అన్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనరాశిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు ప్రైవేటీకన్ వైపు అడుగులు వేస్తూ ప్రజలను మోసం చేసిందన్నారు. మొన్ననే విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో శంఖారావం పూరించడం జరిగిందని భవిష్యత్తులో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై వివిధ రూపాలలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడదామని తెలిపారు. *ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గుజ్జుల.వలరాజు, బందెల నాసర్ జి* మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని గిరిజన హాస్టల్ లో మరణాలు అరికట్టాలని అలాగే పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77 రద్దు చేయాలని పెండింగ్లో ఉన్న 6400 కోట్ల రూపాయలు ఫీజ్ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని తెలిపారు. రెండు రోజులపాటు విశాఖపట్నంలో ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా సమితి సిటీ లో మరియు స్టీల్ ప్లాంట్లో నిర్వహించిన బహిరంగ సభ, అవగాహన సదస్సు విజయవంతంగా ముగిసాయన్నారు. బస్సు యాత్రలో ప్రవేశపెట్టిన డిమాండ్స్ బస్సుయాత్ర ముగిసే లోపు పరిష్కరించకపోతే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ సదస్కు *ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె. అచ్యుతరావు ప్రత్యక్షంగా పాల్గొని మద్దతు తెలిపారు.* కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిలు ఎన్. నాగభూషణ్, మస్తాన్ షరీఫ్ కుళాయి స్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చలపతి, జిల్లా నాయకత్వం శేఖర్ మౌనిక కిరణ్ అభిషేక్ కంజీర గణేష్ హారిక పాల్గొన్నారు.


