Wednesday, 25 March 2026
  • Home  
  • రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి*
- విశాఖపట్నం

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి*

*రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి* విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- *నక్కపల్లిలో 69వ ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల స్కూల్ గేమ్స్ ప్రారంభించిన హోం మంత్రి అనిత* నక్కపల్లిలో అండర్–19 రాష్ట్ర స్థాయి బాలబాలికల హాకీ చాంపియన్‌షిప్ పోటీలను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి విద్యార్థులు హాజరయ్యారు. మూడు రోజులపాటు బాల, బాలికల జట్ల మధ్య ఆసక్తికర పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముందుగా హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం మంత్రి అనిత విద్యార్థులను పరిచయం చేసుకుని వారి గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థుల ఆకర్షణీయ నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఆటలు జీవితంలో ఒక ముఖ్య భాగమని మంత్రి అనిత పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో కొంతమంది తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెడతున్నారని, మార్కులు ముఖ్యంకాదని, క్రీడలు ముఖ్యం అని ఆమె స్పష్టం చేశారు. ఉమెన్ క్రికెట్‌కు పెరుగుతున్న గుర్తింపును ప్రశంసిస్తూ, బాలికలకు క్రికెటర్ చరణ్ శ్రీ ఆదర్శమని పేర్కొన్నారు. నక్కపల్లిలోనే 40–50 మంది హాకీ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమని తెలిపారు. పాఠశాల స్థాయిలోనే క్రీడలను ప్రోత్సహించడంలో మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న చర్యలను ఆమె అభినందించారు. ఆటల్లో గెలుపు–ఓటములు సహజమని, క్రీడల్లో పాల్గొనే ప్రతీ ఒక్కరూ విజేతలే అని అన్నారు. Ncc, Nss కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు క్రీడల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. త్వరలో నక్కపల్లిలో హాకీ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు.

*రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి*
విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-
*నక్కపల్లిలో 69వ ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల స్కూల్ గేమ్స్ ప్రారంభించిన హోం మంత్రి అనిత*

నక్కపల్లిలో అండర్–19 రాష్ట్ర స్థాయి బాలబాలికల హాకీ చాంపియన్‌షిప్ పోటీలను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి విద్యార్థులు హాజరయ్యారు. మూడు రోజులపాటు బాల, బాలికల జట్ల మధ్య ఆసక్తికర పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ముందుగా హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం మంత్రి అనిత విద్యార్థులను పరిచయం చేసుకుని వారి గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థుల ఆకర్షణీయ నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా
హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఆటలు జీవితంలో ఒక ముఖ్య భాగమని మంత్రి అనిత పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో కొంతమంది తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెడతున్నారని,
మార్కులు ముఖ్యంకాదని, క్రీడలు ముఖ్యం అని ఆమె స్పష్టం చేశారు. ఉమెన్ క్రికెట్‌కు పెరుగుతున్న గుర్తింపును ప్రశంసిస్తూ, బాలికలకు క్రికెటర్ చరణ్ శ్రీ ఆదర్శమని పేర్కొన్నారు. నక్కపల్లిలోనే 40–50 మంది హాకీ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమని తెలిపారు.
పాఠశాల స్థాయిలోనే క్రీడలను ప్రోత్సహించడంలో మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న చర్యలను ఆమె అభినందించారు. ఆటల్లో గెలుపు–ఓటములు సహజమని, క్రీడల్లో పాల్గొనే ప్రతీ ఒక్కరూ విజేతలే అని అన్నారు. Ncc, Nss కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు క్రీడల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. త్వరలో నక్కపల్లిలో హాకీ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.