Sunday, 7 December 2025
  • Home  
  • *రాష్ట్రంలో అక్టోబర్‌ 2025 నెలలో నికర జీఎస్‌టీ వసూళ్లు 8.77% వృద్ధి నమోదు… *రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్*
- E-పేపర్

*రాష్ట్రంలో అక్టోబర్‌ 2025 నెలలో నికర జీఎస్‌టీ వసూళ్లు 8.77% వృద్ధి నమోదు… *రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్*

*రాష్ట్రంలో అక్టోబర్‌ 2025 నెలలో నికర జీఎస్‌టీ వసూళ్లు 8.77% వృద్ధి నమోదు… *రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్* *బాబు ఏ రాష్ట్ర ప్రభుత్వం జీఎస్‌టీ 2.0 సంస్కరణలను అమలులోకి తీసుకు వచ్చిన తర్వాత 2025 అక్టోబర్‌ నెలలో ఆదాయ వృద్ధిని సాధించింది. ప్రధాన వినియోగ వస్తువులు, ఔషధాలు, సిమెంట్‌ వంటి పలు వస్తువులపై పన్ను రేట్లు తగ్గించినప్పటికీ, నికర జీఎస్‌టీ వసూళ్లు గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే 8.77% వృద్ధి రేటు సాధించాయి. జీఎస్‌టీ పరిహార సెస్‌ (Compensation Cess) పొగాకు ఉత్పత్తుల మినహా అన్ని వస్తువులపై తొలగించబడింది. పన్ను రేట్లు తగ్గినా వినియోగం పెరగడం, ప్రభుత్వ ప్రణాళికాత్మక విధానాలు, పటిష్టంగా పన్ను అమలు వ్యవస్థల వల్ల ఈ వృద్ధి సాధ్యమైంది. *ప్రధానాంశాలు: *నికర జీఎస్‌టీ వసూళ్లు:* ₹3,021 కోట్లు_ ఇప్పటివరకు అక్టోబర్ నెలలో రెండవ అత్యధిక స్థాయి. *స్థూల జీఎస్‌టీ వసూళ్లు: ₹3,490 కోట్లు — అక్టోబర్ నెలలో మూడవ అత్యధిక స్థాయి. ఏప్రిల్‌ నుండి అక్టోబర్‌ 2025 వరకు ప్రతి నెలా వసూళ్లు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అధికంగా నమోదయ్యాయి. *SGST వసూళ్లు* : ₹1,247 కోట్లు (6.2% వృద్ధి) *IGST సెటిల్‌మెంట్‌:* ₹1,773 కోట్లు (10.65% వృద్ధి) పెట్రోలియం VAT: ₹1,282 కోట్లు (7.88% వృద్ధి) *ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌: అక్టోబర్‌లో 18.26% వృద్ధి *ప్రభుత్వ చర్యలు: *డేటా అనలిటిక్స్‌ వినియోగం:* పన్ను ఎగవేతలు, తప్పుడు ITC క్లెయిమ్స్‌ గుర్తించేందుకు ఆధునిక డేటా విశ్లేషణ, కృత్రిమ మేధస్సు పద్ధతుల వినియోగం. *కేంద్ర–రాష్ట్ర సమన్వయం: IGST సెటిల్‌మెంట్‌ వేగవంతం చేయడం, పెద్ద బకాయిదారులపై చర్యలు. *పనితీరు ఆధారిత నియామకాలు: పన్ను వసూళ్లలో ప్రతిభ చూపిన అధికారులను అధిక ఆదాయ సామర్థ్యం గల ప్రాంతాలలో నియమించడం. *IGST రివర్సల్‌:* ₹279 కోట్ల తప్పుడు క్రెడిట్లను రద్దు చేయడం. *రిటర్న్‌ ఫైలింగ్‌ పెంపు:* పన్ను చెల్లింపుదారుల సమయానుసార రిటర్న్స్ సమర్పణను నిర్బంధించడం. *బలమైన దర్యాప్తు వ్యవస్థ:* పన్ను మోసాలు, తప్పుడు లావాదేవీలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవటం *డిఫాల్టర్లపై ప్రత్యేక డ్రైవ్‌: గతంలో అధిక పన్ను చెల్లించి ఈ ఏడాది రిటర్న్‌ ఫైలింగ్‌ చేయని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవటం *ఆస్తి, బ్యాంకు ఖాతా ద్వారా వసూళ్లు:* నిరంతర బకాయిదారులపై వేగవంతమైన వసూలు చర్యలు. *మొత్తం వసూళ్లు: అక్టోబర్‌ 2025 లో అన్ని విభాగాల్లో కలిపి ₹4,458 కోట్లు వసూలయ్యాయి, ఇది గత ఏడాది అక్టోబర్‌ (₹4,126 కోట్లు) కంటే 8.03% అధికం. ఏప్రిల్‌–అక్టోబర్‌ 2025 మధ్య కాలంలో మొత్తం ఆదాయం 5.58% వృద్ధి సాధించింది. ఈ ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వ సమర్థ పన్ను పరిపాలన, బలమైన పర్యవేక్షణ, డేటా ఆధారిత చర్యలు, పన్ను చెల్లింపుదారుల విస్తరణకు సంకేతంగా పేర్కొనవచ్చునని ప్రధాన రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ బాబు ఏ ఆ ప్రకటన లో తెలియజేశారు..

*రాష్ట్రంలో అక్టోబర్‌ 2025 నెలలో నికర జీఎస్‌టీ వసూళ్లు 8.77% వృద్ధి నమోదు…

*రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్*
*బాబు ఏ

రాష్ట్ర ప్రభుత్వం జీఎస్‌టీ 2.0 సంస్కరణలను అమలులోకి తీసుకు వచ్చిన తర్వాత 2025 అక్టోబర్‌ నెలలో ఆదాయ వృద్ధిని సాధించింది. ప్రధాన వినియోగ వస్తువులు, ఔషధాలు, సిమెంట్‌ వంటి పలు వస్తువులపై పన్ను రేట్లు తగ్గించినప్పటికీ, నికర జీఎస్‌టీ వసూళ్లు గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే 8.77% వృద్ధి రేటు సాధించాయి.

జీఎస్‌టీ పరిహార సెస్‌ (Compensation Cess) పొగాకు ఉత్పత్తుల మినహా అన్ని వస్తువులపై తొలగించబడింది. పన్ను రేట్లు తగ్గినా వినియోగం పెరగడం, ప్రభుత్వ ప్రణాళికాత్మక విధానాలు, పటిష్టంగా పన్ను అమలు వ్యవస్థల వల్ల ఈ వృద్ధి సాధ్యమైంది.

*ప్రధానాంశాలు:

*నికర జీఎస్‌టీ వసూళ్లు:* ₹3,021 కోట్లు_ ఇప్పటివరకు అక్టోబర్ నెలలో రెండవ అత్యధిక స్థాయి.

*స్థూల జీఎస్‌టీ వసూళ్లు:

₹3,490 కోట్లు — అక్టోబర్ నెలలో మూడవ అత్యధిక స్థాయి.

ఏప్రిల్‌ నుండి అక్టోబర్‌ 2025 వరకు ప్రతి నెలా వసూళ్లు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అధికంగా నమోదయ్యాయి.

*SGST వసూళ్లు* : ₹1,247 కోట్లు (6.2% వృద్ధి)

*IGST సెటిల్‌మెంట్‌:* ₹1,773 కోట్లు (10.65% వృద్ధి)

పెట్రోలియం VAT: ₹1,282 కోట్లు (7.88% వృద్ధి)

*ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌:

అక్టోబర్‌లో 18.26% వృద్ధి

*ప్రభుత్వ చర్యలు:

*డేటా అనలిటిక్స్‌ వినియోగం:*
పన్ను ఎగవేతలు, తప్పుడు ITC క్లెయిమ్స్‌ గుర్తించేందుకు ఆధునిక డేటా విశ్లేషణ, కృత్రిమ మేధస్సు పద్ధతుల వినియోగం.

*కేంద్ర–రాష్ట్ర సమన్వయం:

IGST సెటిల్‌మెంట్‌ వేగవంతం చేయడం, పెద్ద బకాయిదారులపై చర్యలు.

*పనితీరు ఆధారిత నియామకాలు:

పన్ను వసూళ్లలో ప్రతిభ చూపిన అధికారులను అధిక ఆదాయ సామర్థ్యం గల ప్రాంతాలలో నియమించడం.

*IGST రివర్సల్‌:* ₹279 కోట్ల తప్పుడు క్రెడిట్లను రద్దు చేయడం.

*రిటర్న్‌ ఫైలింగ్‌ పెంపు:* పన్ను చెల్లింపుదారుల సమయానుసార రిటర్న్స్ సమర్పణను నిర్బంధించడం.

*బలమైన దర్యాప్తు వ్యవస్థ:* పన్ను మోసాలు, తప్పుడు లావాదేవీలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవటం

*డిఫాల్టర్లపై ప్రత్యేక డ్రైవ్‌:

గతంలో అధిక పన్ను చెల్లించి ఈ ఏడాది రిటర్న్‌ ఫైలింగ్‌ చేయని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవటం

*ఆస్తి, బ్యాంకు ఖాతా ద్వారా వసూళ్లు:*

నిరంతర బకాయిదారులపై వేగవంతమైన వసూలు చర్యలు.

*మొత్తం వసూళ్లు:

అక్టోబర్‌ 2025 లో అన్ని విభాగాల్లో కలిపి ₹4,458 కోట్లు వసూలయ్యాయి, ఇది గత ఏడాది అక్టోబర్‌ (₹4,126 కోట్లు) కంటే 8.03% అధికం.

ఏప్రిల్‌–అక్టోబర్‌ 2025 మధ్య కాలంలో మొత్తం ఆదాయం 5.58% వృద్ధి సాధించింది.

ఈ ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వ సమర్థ పన్ను పరిపాలన, బలమైన పర్యవేక్షణ, డేటా ఆధారిత చర్యలు, పన్ను చెల్లింపుదారుల విస్తరణకు సంకేతంగా పేర్కొనవచ్చునని
ప్రధాన రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ బాబు ఏ ఆ ప్రకటన లో తెలియజేశారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.