Sunday, 14 December 2025
  • Home  
  • రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం*
- విశాఖపట్నం

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం*

*రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం* *ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు చెప్పనవి కూడా అమలు చేస్తున్నాం* *మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి* *విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డా.స్వామి* *విశాఖపట్నం డిసెంబర్ 13పున్నమి ప్రతినిధి* రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం నాడు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తో కలిసి ఇల్ల పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……సెంటు భూముల్లో ఆప్షన్-3 గృహాలు స్వాధీన పత్రాలు అందజేయడంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కృషి అభినందనీయం. మీరు వెళ్లే ప్రాంతాలు కూడా భవిష్యత్తులో అభివృద్ధి చెందుతాయి. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ పై సీఎం చంద్రబాబునాయుడు 9 జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయటానికి సంసిద్ధంగా ఉన్నారు. కేంద్రం ఇచ్చిన ఇల్లు కూడా గత వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. నేడు కూటమి ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణం కోసం అదనంగా ఎస్సీ, బీసీలకు రూ. 50 వేలు, ఎస్టీలకు రూ. 75 వేలు, మరీ వెనుకబడిన వారికి రూ.1 లక్ష చొప్పున సాయం చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నాం. వృద్ధులకు పింఛను రూ. 200 నుంచి రూ. 2 వేలు, రూ.2 వేల నుంచి రూ. 4 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదే. పింఛన్ రూ.1000 పెంచడానికి జగన్ కి 5 ఏళ్లు పట్టింది. ఆడపడుచులకు స్త్రీ శక్తి పధకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. దీపం -2 పథకం కింద ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలెండర్ల చొప్పన ఉచితంగా ఇస్తున్నాం. ఇచ్చిన హామీలను అమలుపరుస్తున్నాం. అన్నా క్యాంటిన్లల్లో ఎవరైనా సరే 5 రూపాయలకే భోంచేసే సదుపాయం కల్పించాం. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం. ఆరుగురు పిల్లలున్నవారికి కూడా డబ్బులొచ్చాయి. ఇలా చెప్పినవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. రేపు ఎస్సీ, బీసీలందరికి ఇళ్లపై సోలార్ కరెంటు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

*రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం*

*ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు చెప్పనవి కూడా అమలు చేస్తున్నాం*

*మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి*

*విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డా.స్వామి*

*విశాఖపట్నం డిసెంబర్ 13పున్నమి ప్రతినిధి*

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం నాడు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తో కలిసి ఇల్ల పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……సెంటు భూముల్లో ఆప్షన్-3 గృహాలు స్వాధీన పత్రాలు అందజేయడంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కృషి అభినందనీయం. మీరు వెళ్లే ప్రాంతాలు కూడా భవిష్యత్తులో అభివృద్ధి చెందుతాయి. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ పై సీఎం చంద్రబాబునాయుడు 9 జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయటానికి సంసిద్ధంగా ఉన్నారు. కేంద్రం ఇచ్చిన ఇల్లు కూడా గత వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. నేడు కూటమి ప్రభుత్వం
పేదల ఇళ్ల నిర్మాణం కోసం అదనంగా ఎస్సీ, బీసీలకు రూ. 50 వేలు, ఎస్టీలకు రూ. 75 వేలు, మరీ వెనుకబడిన వారికి రూ.1 లక్ష చొప్పున సాయం చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నాం. వృద్ధులకు పింఛను రూ. 200 నుంచి రూ. 2 వేలు, రూ.2 వేల నుంచి రూ. 4 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదే. పింఛన్ రూ.1000 పెంచడానికి జగన్ కి 5 ఏళ్లు పట్టింది. ఆడపడుచులకు స్త్రీ శక్తి పధకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. దీపం -2 పథకం కింద ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలెండర్ల చొప్పన ఉచితంగా ఇస్తున్నాం. ఇచ్చిన హామీలను అమలుపరుస్తున్నాం. అన్నా క్యాంటిన్లల్లో ఎవరైనా సరే 5 రూపాయలకే భోంచేసే సదుపాయం కల్పించాం. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం. ఆరుగురు పిల్లలున్నవారికి కూడా డబ్బులొచ్చాయి. ఇలా చెప్పినవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. రేపు ఎస్సీ, బీసీలందరికి ఇళ్లపై సోలార్ కరెంటు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.