పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 29 : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన తప్పులకు ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రకృతి, సహజ వనరులను నాశనం చేయటం వల్ల తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాల పెద్ద చెరువు ఉప్పొంగి రోడ్లు, కాలనీలు ముంచెత్తుతున్నాయని కేఎల్ఆర్ అన్నారు.
శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఆలయం రోడ్డు మరమ్మతులు, చెరువులో గుర్రపు డెక్క తొలగింపు, బ్రిడ్జి పునరుద్దరించి సమీప గ్రామాల ప్రజలకు రహదారి సౌకర్యం త్వరలో కల్పిస్తామని కిచ్చెన్న హామీ ఇచ్చారు.
తూములను పునరుద్ధరించి చెరువు ముంపు నుంచి రోడ్డు, కాలనీలను కాపాడుతామని… సంబంధిత అధికారులతో మాట్లాడారు. హెచ్ఎండిఎ ఆర్&బీ, మున్సిపాలిటీ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని లక్ష్మారెడ్డి కోరారు.

*రావిర్యాల పెద్దచెరువు ముంపును అరికడతాం: కేఎల్ఆర్* –తూములు, గుర్రపుడెక్క సమస్యకు త్వరలోనే పరిష్కారం –రోడ్డు మరమ్మతులు, బ్రిడ్జి నిర్మాణంపై అధికారులతో చర్చ –శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ భక్తులకు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి హామీ
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 29 : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన తప్పులకు ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి, సహజ వనరులను నాశనం చేయటం వల్ల తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాల పెద్ద చెరువు ఉప్పొంగి రోడ్లు, కాలనీలు ముంచెత్తుతున్నాయని కేఎల్ఆర్ అన్నారు. శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఆలయం రోడ్డు మరమ్మతులు, చెరువులో గుర్రపు డెక్క తొలగింపు, బ్రిడ్జి పునరుద్దరించి సమీప గ్రామాల ప్రజలకు రహదారి సౌకర్యం త్వరలో కల్పిస్తామని కిచ్చెన్న హామీ ఇచ్చారు. తూములను పునరుద్ధరించి చెరువు ముంపు నుంచి రోడ్డు, కాలనీలను కాపాడుతామని… సంబంధిత అధికారులతో మాట్లాడారు. హెచ్ఎండిఎ ఆర్&బీ, మున్సిపాలిటీ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని లక్ష్మారెడ్డి కోరారు.

