ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం జిల్లాలోని ప్రముఖ వైద్యశాల శ్రీ రక్ష హాస్పిటల్ డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రారంభమైన శ్రీ రక్ష ఆరోగ్య యాత్ర శనివారం బోనకల్ మండలం రావినూతల గ్రామంలో నిర్వహించబడింది. గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి రావినూతల గ్రామ సర్పంచ్ భూక్య భద్రం నాయక్, ఉప సర్పంచ్ దొండపాటి సత్యనారాయణ, అలాగే దొండపాటి నాగేశ్వరరావు, మైనేని నారాయణ, వట్టికుండ కృష్ణ, జోనిబొయిన గురువయ్య, చేబ్రోలు మల్లికార్జున రావు, షేక్ జానీ, గుగులోతు నరేష్, తాళ్లూరి సురేష్, బోయినపల్లి గోపాల్, చేబ్రోలు చిన్న మల్లికార్జున రావు, బీపీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ రక్ష ఆరోగ్య యాత్ర బృందం గ్రామ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, గ్రామస్తులు అధిక సంఖ్య లో హాజరై ఈ యాత్ర ని జయ ప్రదం చేసారు.


