రాయలసీమకు నీటి కరువు నేతలకు నీతి కరువు
రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి
నాలుగు పర్యాయాలు శాసనసభకు ఎన్నికైన ఈ ప్రాంత మాజీ శాసనసభ్యులు సొంత ఊరికి బ్రిడ్జి నిర్మించుట కోసం సంవత్సరాలుగా ఎదురు చూడాల్సిన దుస్థితి ఆ గ్రామాల ప్రజలది ఇక విషయానికొస్తే
రైల్వే కోడూరు మండలంలోని *రెడ్డివారి పల్లి పంచాయతీ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లాలంటే చాలా దుర్భరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ వర్షాకాలంలో పాలకుల నిర్లక్ష్యంతో అధికారుల అలసత్వంతో* వర్షం వచ్చిందంటే చాలు తాత్కాలికమైన మట్టి రోడ్డు కొట్టుకుపోవాల్సిందే, నిర్మాణ దశలో ఉన్నటువంటి బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతుండడంతో* మూడు కిలోమీటర్లు దూరం ప్రయాణించి సొంతగూటికి చేరుకోవలసిన దుస్థితి ఆప్రాంత ప్రజలది .కనుక నిర్మాణ దశలో ఉన్నటువంటి *బ్రిడ్జిని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తిచేసి* ప్రజలకు మెరుగైన రాకపోకలను అందుబాటులోకి తీసుకురావాలి.రైల్వేకోడూరు మండల భారతీయ జనతా పార్టీ అధికారులకు, కాంట్రాక్టర్లకు విజ్ఞప్తి చేస్తుంది.
ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు మండల అధ్యక్షులు సాయం శ్రీధర్, రాష్ట్ర కిసాన్ మోర్చా మాజీ కన్వీనర్ తోట శ్రీనివాసులు* మరియు కిసాన్ మోర్చా అన్నమయ్య జిల్లా అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ వర్మ మరియు వీహెచ్ పి దరిశ వెంకటరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కుప్పాల కిరణ్ మరియు మండల ఆఫీస్ సెక్రటరీ అందరివాడు సుబ్బారావు మరియు మహిళా నాయకురాలు కుప్పాల జ్యోతి మరియు ఇతరులు పాల్గొన్నారు.


