రాయచోటిలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసి పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. వరదనీటిలో కొట్టుకుపోతున్న తల్లీ, బిడ్డ షేక్ మున్నీ (27), ఇలియాస్ (6)ను కాపాడబోయి మరో వ్యక్తి వంగల గణేశ్ (30) మృతి చెందాడు. రామాపురం వద్ద స్కూల్ ఆటోలో నుంచి దూకేసి మాధవరం ఆరవ వాండ్లపల్లికి చెందిన ఆరవ యామిని (8) డ్రైన్ కాలువలో కొట్టుకుపోయింది. బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

రాయచోటిలో వర్ష బీభత్సం.. ముగ్గురి మృతి