– మండల స్థాయి పోటీలు
కామారెడ్డి, 05 నవంబర్,( పున్నమి ప్రతినిధి ) :
విద్యార్థుల ప్రతిభాభివ్యక్తికి వేదికగా రామారెడ్డి విద్యావేదికలో ప్రతిధ్వనించిన విజయం!రామారెడ్డి మండలంలోని ఉన్నత ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వ హించిన మండల స్థాయి క్విజ్, ఉపన్యాసం, వ్యాస రచన పోటీల్లో విద్యార్థుల చురుకుగా పాల్గొన్నారు. సృజనాత్మక ఆలోచనలతో విద్యా వాతావరణం ప్రేరణతో నిండిపోయింది. ఈ కార్యక్రమం (GHM) ల సమన్వయంలో, జిల్లా విద్యాధికారి శ్రీ రాజు మార్గదర్శకత్వంలో విజయవంతంగా ముగిసిం ది.అగ్రశ్రేణి విజేతలుక్విజ్: K. సృజాన్ (గర్ల్స్ హైర్ సెకండరీ స్కూల్, రామారెడ్డి)ఉపన్యాసం: B. మధులిక (జెపిహెచ్‌ఎస్, గిద్ద)వ్యాసరచన: B. సందీప్ (జెపిహెచ్‌ఎస్, బాయ్స్,రామారెడ్డి)విజేతల ప్రతిభను గౌరవిస్తూ జిల్లా విద్యాధికారి శ్రీ రాజు అందజేశారు. ఈ వేడుకలో ఉపాధ్యాయులు, CRPలు, విద్యాధికారులు కలసి విద్యార్థులకు ప్రోత్సాహాన్నిచ్చారు.కార్యక్రమంలో పాల్గొన్న వారిలోMEO ఆనంద్ రావు సార్, కాంప్లెక్స్ హెచ్ఎంలు ఆనంద్ సార్, గోపాల్ రెడ్డి సార్, GHM లు వేణు మాధవ్, శ్రీనివాస్, కన్నయ్య, CRP మహమూద్, యుగంధర్, సురేఖ, అజీమ్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం విద్యార్థులలో విద్యా పట్ల ఆసక్తిని పెంపొందించినట్లే, పాఠశాలల మధ్య సుహృద్భావ పోటీ వాతావరణాన్ని కూడా అలవర్చింది. రామారెడ్డి విద్యా వేదిక ఈ విజయాలతో మరో పటిష్టమైన ప్రేరణాత్మక అడుగు వేసింది.


